Friday, 1 May 2020

బాలకృష్ణ క్యారెక్టర్ బయటపెట్టిన బోయపాటి.. సీక్రెట్ రివీల్ చేస్తూ భలే ట్విస్ట్ ఇచ్చారే!

స్టార్ హీరోల సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఆ విషయాలు సీక్రెట్‌గా ఉంచుతుంటారు దర్శకనిర్మాతలు. తమ తమ సినిమాల్లో హీరోహీరోయిన్ల క్యారెక్టర్స్ విషయమై ఎన్ని వార్తలొచ్చినా ఆ సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంటారు. కానీ మాస్ డైరెక్టర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ తన మూవీ సీక్రెట్ రివీల్ చేశారు. నందమూరి నటసింహం బాలకృష్ణతో తాను చేయబోతున్న సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది చెప్పేశారు. గతంలో బోయపాటి శ్రీను- కాంబోలో వచ్చిన ''సింహా, లెజెండ్'' సినిమాలు భారీ హిట్ సాధించడంతో వారిద్దరి కాంబోలో రాబోతున్న తాజా సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై కొద్దిభాగం ఫినిష్ చేసుకొని ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఈ చిత్రంలో బాలయ్యబాబు క్యారెక్టర్ చాలా డిఫెరెంట్‌గా ఉండనుందని, గతంలో ఎన్నడూ చూడని విధంగా అఘోరా లుక్‌‌లో ఆయన నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించిన బోయపాటి.. ఆ వార్తలు నిజమే అని, మీరనుకున్నట్లుగానే బాలకృష్ణ అఘోరాగా కనిపిస్తారని చెప్పారు. రాయలసీమ, వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని సమాచారం. కొన్ని నిమిషాల వ్యవధిలో జన్మించిన కవల సోదరుల రూపంలో రెండు డిఫరెంట్ అవతారాల్లో ఆయన కనిపించనున్నారని ఫిలిం నగర్ టాక్. అందుకేనేమో ఒకటి అఘోర లుక్ అని కన్ఫమ్ చేసి రెండో లుక్ ఏంటనే దానిపై ఆసక్తి రేకెత్తిస్తూ ట్విస్ట్ ఇచ్చారు బోయపాటి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రీయ, అంజలి లలో ఓ హీరోయిన్‌ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట బోయపాటి. మరో హీరోయిన్‌గా సోనాల్ చౌహాన్ పేరు కూడా వినిపిస్తోంది. అతిత్వరలో హీరోయిన్స్ విషయమై అఫీషియల్ ప్రకటన రానుందని సమాచారం. ఇకపోతే ఈ సినిమా కోసం బాలయ్యబాబు 15 కిలోల బరువు తగ్గడం విశేషం. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YmLUP5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...