Monday, 4 May 2020

చిరంజీవి స్వీటెస్ట్ లెజెండ్.. త్రిష కామెంట్‌కి మెగా ఫ్యాన్స్ ఫిదా

హీరోయిన్‌గా దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటి త్రిష. రెండు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తు్న్నారు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా తెలుగు, తమిళంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు త్రిష. స్టార్ హీరోలందరితోనూ నటించి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆమెకి తెలుగులో సినిమాలు లేకపోయినప్పటికీ తమిళంలో బిజీ ఆర్టిస్ట్. నేడు (మే 4న) త్రిష పుట్టినరోజు. ఆమె 37వ ఏట అడుగుపెట్టారు. త్రిష పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీతారలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ‘‘హ్యాపీ బర్త్‌డే త్రిష. నువ్వు ఎల్లకాలం సంతోషంగా ఉండాలని, విజయం నిన్ను వరించాలని కోరుకుంటున్నా. ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలి’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు త్రిష స్పందించారు. ‘థాంక్యూ టు స్వీటెస్ట్ లెజెండ్’ అని త్రిష రిప్లై ఇచ్చారు. ఒక లవ్ సింబల్ కూడా వేశారు. 14 ఏళ్ల క్రితం ‘స్టాలిన్’ సినిమాలో చిరంజీవి సరసన నటించారు త్రిష. తాజాగా ‘ఆచార్య’ సినిమాలో రెండోసారి చిరంజీవి సరసన నటించే అవకాశం వచ్చింది. కానీ, అనుకోని కారణాల వల్ల ఆమె ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన త్రిష.. ‘వర్షం’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా త్రిషకు మంచి ఇమేజ్‌ను తీసుకొచ్చింది. ఇక అక్కడి నుంచి త్రిష వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dcC3PT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...