Monday, 11 May 2020

50 మిలియ‌న్ల ‘నీ కళ్లు నీలి సముద్రం’.. ఇది దేవీశ్రీ ‘ఉప్పెన‌’

2020లో సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రించిన పాట‌ల్లో ‘నీ క‌ళ్లు నీలి స‌ముద్రం’ ఒక‌టి. దేవీశ్రీ ‌ప్రసాద్ కూర్చిన అద్భుత‌మైన ఖ‌వ్వాలీ బాణీల‌కు త‌న మ‌ధుర‌మైన గాత్రంతో జావేద్ అలీ జీవం పోశారు. శ్రీ‌మ‌ణి, ర‌ఖీబ్ ఆల‌మ్ అందించిన సాహిత్యం ఈ పాట‌ను ఇంత ఆక‌ర్షణీయంగా మార్చేసింది. తాజాగా ‘నీ క‌ళ్లు నీలి స‌ముద్రం’ పాట ఒక మైలురాయిని చేరుకుంది. యూట్యూబ్‌లో 50 మిలియ‌న్ వ్యూస్‌ను దాటేసింది. చిన్నా పెద్దా తార‌త‌మ్యం లేకుండా అన్ని వ‌య‌సుల వారూ ఈ పాట‌ను ఆస్వాదిస్తుండ‌టం విశేషం. హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్‌, కృతి శెట్టి.. ఇద్దరికీ ఇదే తొలి చిత్రమైన‌ప్పటికీ ఈ పాట‌లో వారు ప్రద‌ర్శించిన హావ‌భావాలు అమితంగా ఆక‌ట్టుకుంటున్నాయి. సంగీతంలో త‌న అభిరుచితో, పాట‌ల‌ను ప్రెజెంట్ చేసిన విధానంతో డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఇప్పటికే టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారారు. మ‌రో పాట ‘ధ‌క్ ధ‌క్ ధ‌క్ ధక్’ ఇప్పటివ‌ర‌కూ 11 మిలియ‌న్ పైగా వ్యూస్ సాధించ‌డం చెప్పుకోద‌గ్గ విష‌యం. త‌మిళ స్టార్ యాక్టర్ విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర పోషిస్తున్నారు. Also Read: ద‌ర్శక‌త్వంతో పాటు క‌థ‌, సంభాష‌ణ‌లు, స్క్రీన్‌ప్లేల‌ను కూడా బుచ్చిబాబు అందించిన ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సాయిచంద్, బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ సినిమాకు నవీన్ నూలి ఎడిటర్. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dBj2a4
v

No comments:

Post a Comment