Thursday, 28 May 2020

ఈనెల 31న సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న మహేష్.. అడ్డంకులేంటి?

లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో ఇండస్ట్రీ కళ తప్పింది.. శుక్రవారం వస్తే కొత్త పెళ్లికూతురులా కనిపించే థియేటర్స్ కరోనా ఎఫెక్ట్‌తో బోసిబోయాయి. అయితే ఇండస్ట్రీ పెద్దలు ఇరు రాష్ట్రాల సీఎంలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో తిరిగి షూటింగ్‌లు ప్రారంభం అయ్యే అవకాశాలు చిగురిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆల్ రెడీ షూటింగ్‌ ప్రారంభమైన చిత్రాలే కాకుండా.. కొత్త సినిమా షూటింగ్‌ల కోసం చాలా సినిమాలు వెయిటింగ్‌లో ఉన్నాయి.‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టేందుకు రెడీగా ఉన్నారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కావడంతో అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ.. మహేష్-పరశురాం కాంబినేషన్‌లో మూవీని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గీతగోవిందం చిత్రంలో పరుశురాం, సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు మంచి ఫామ్‌లో ఉండటంతో ఈ ఇద్దరి కాంబో కోసం ఆసక్తిగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే మే 31 ఆదివారం నాడు ఈ మూవీ లాంఛ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నా.. పోలీసుల నుంచి ఇంకా అనుమతులు లభించలేదట. అయితే ట్విట్టర్ ద్వారా టైటిల్ లోగో రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇవ్వబోతుందట చిత్ర యూనిట్. ఈ చిత్రానికి ‘సర్కార్ వారి పాట’ అనే వెరైటీ టైటిల్ ప్రచారంలో ఉండగా.. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X9LKJR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...