Wednesday, 27 May 2020

మహేష్ బాబులో ఇన్ని మార్పులా ? మరీ 20 ఏళ్ల కుర్రాడిలా!

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు లాక్‌డౌన్‌లో పూర్తిగా మారిపోయాడు. కొన్ని నెలుగా ఇంట్లోనే ఉంటూ గ్లామర్ పెంచేస్తున్నాడు. దీనికి ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్న ఫోటోలే ఉదాహరణ. అది ఎంతంటే మరీ 20 ఏళ్ల కుర్రాడిలా కనిపించేంతగా మారిపోయాడు. వర్కౌట్, ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టి ఇంతకు ముందు కంటే అందంగా మారిపోయాడు. తాజాగా తన కూతురు సితారతో కలిసి దిగిన మిర్రర్ సెల్ఫీ ఫొటో ఒకటి బయటకు రావడంతో మహేష్ గ్లామర్ బయటపడింది. ఆ పిక్‌ చూసిన నెటిజన్లంతా నోరెళ్ల బెడుతున్నారు. నిజంగా మహేష్ బాబేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొడుకు గౌతమ్‌కు అన్నలా మారిపోయాడని మరి కొందరు అంటున్నారు. సంతూర్ డాడీలా ఉన్నాడంటూ ఇంకొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ సంతూర్ యాడ్ చేసిన విషయం మనకు తెలిసిందే. దీంతో యంగ్ లుక్‌లో మహేష్ పిక్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సినిమా షూటింగ్స్ తర్వాత ఎప్పుడు కుటుంబానికే మహేష్ బాబు ఎక్కువగా సమయం కేటాయిస్తాడు. లాక్‌డౌన్ కావడంతో తన కూతురు, కొడుకుతో కలిసి సరదాగా గడుపుతూ.. ఫొటోలకు ఫోజులు ఇస్తున్నాడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేయగా నెటిజన్లు ఆశ్చర్యపోయారు. తన యంగ్ ఏజ్ ఎలా కనిపించాడో అంతలా మారిపోయాడు. దీన్ని చూసిన అభిమానులు మరీ కుర్రాడిలా మారిపోయాడేంటని అంతా చర్చించుకుంటున్నారు. ఆయన గౌతమ్ కు అన్నయ్యలా ఉన్నాడంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఎప్పుడూ గ్లామర్‌తో కనిపించే ప్రిన్స్ ఈ లాక్‌డౌన్‌లో మరింతగా మారిపోయాడు. ఇంట్లోనే ఉండి, ఫిట్ నెస్ ను మరింతగా పెంచుకున్న మహేశ్, ఫిజిక్ తో పాటు తన అందాన్ని కూడా పెంచుకుని మరింత యంగ్ గా కనిపిస్తున్నారు. కళ్లు తిప్పుకోలేనంత అందంగా మహేశ్ బాబు కనిపిస్తుండగా, తన యంగ్ ఏజ్ లో కూడా ఆయన ఇంతలా ఆకట్టుకునే రూపంతో ఉండి ఉండరని, అంత బాగున్నారని కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ ఏజ్ 44 ఏళ్లు. 1975 ఆగష్టు 9న పుట్టాడు. నాలుగు పదుల వయసులో కూడా మహేష్ ఇంత గ్లామర్‌గా ఉండటం చూసి ఇక లేడీస్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eqpSzB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...