Monday, 6 April 2020

Short Film On Coronavirus: చిరు, రజినీ, అమితాబ్ షార్ట్ ఫిల్మ్.. టెలికాస్ట్ ఎప్పుడంటే!

కరోనాపై పోరాటానికి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ఏకం అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు ప్రకటిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్లు వీడియో సందేశాలు ఇవ్వగా.. సంగీత దర్శకులు కోటీ, కీరవాణి, కుంచె రఘులు స్వరపరిచిన కరోనా సాంగ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ అందరూ ఈ కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా మరో అడుగు ముందుకు వేశారు. చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్, రజనీకాంత్, ప్రియాంక చోప్రా, రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌తో పాటు తదితర స్టార్స్ అంతా ‘ఫ్యామిలీ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. ప్రసూన్‌ పాండే దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలింలో బిగ్ బీ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మిగిలిన స్టార్లు భాగం అవుతున్నారు. సోమవారం రాత్రి 9గంటలకు సోనీ నెట్‌వర్క్‌లో ఈ షార్ట్ ఫిల్మ్ ప్రసారం కానుంది. కోవిడ్ 19 ప్రభావంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ షార్ట్‌ ఫిలింను రూపొందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aY1xQF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...