Thursday, 9 April 2020

నటుడు నర్సింగ్ యాదవ్‌కు ప్రమాదం.. పరిస్థితి విషమం

పలు తెలుగు సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ ప్రమాదానికి గురయ్యారు. గురువారం (ఏప్రిల్ 9న) సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో ప్రమాదశాత్తు నర్సింగ్ పడిపోయారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకి వెంటిలేర్‌పై చికిత్స అందిస్తున్నారు. తలకు బలమైన గాయమైందని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కాగా, నర్సింగ్ యాదవ్ 25 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్రవేశారు. రామ్ గోపాల్ వర్మ చిత్రాలతో నర్సింగ్ యాదవ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ‘క్షణం క్షణం’లో ఆయన చేసిన నర్సింగ్ పాత్ర ఆయనకు పాపులారిటీ తెచ్చిపెట్టింది. నర్సింగ్‌ను చిరంజీవి కూడా బాగా ప్రోత్సహించారు. చిరంజీవితో పాటు చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నర్సింగ్ నటించారు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ తన పాత్రలకు ప్రత్యేకత తీసుకొచ్చారు నర్సింగ్. ‘మాస్టర్’, ‘చంద్రలేఖ’, ‘ఇడియట్’, ‘జానీ’, ‘ఠాగూర్’, ‘వర్షం’, ‘సై’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘మాస్’, ‘అడవి రాముడు’, ‘డార్లింగ్’ ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించారు. చివరిగా ‘ఖైదీ నెం. 150’లో కనిపించారు. 400కు పైగా సినిమాల్లో నర్సింగ్ యాదవ్ నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34pZp1t
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...