Thursday, 9 April 2020

త్రీ షేడ్స్.. ‘పుష్ప’ సినిమా కథ ఇదే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో మూడో సినిమాగా తెరకెక్కుతుంది ‘పుష్ప’. బన్నీ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్‌ను ప్రకటించడమే కాకుండా ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లను కూడా విడుదల చేసారు. అయితే, ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది అని బన్నీ అభిమానులకు, ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. పాన్ ఇండియా సినిమా అయినా కథలో ఇన్వాల్వ్‌మెంట్ ఉన్న పాత్ర పేరు కాబట్టి అన్ని భాషల్లో ‘పుష్ప’ అనే టైటిల్‌నే ఫిక్స్ చేశారు. ‘పుష్ప’ అనే టైటిల్ కేవలం చిత్తూరు ఏరియాలోనే కాదు తమిళ్‌లో, మలయాళంలో కూడా ఎక్కువ మందికి ఉంటుంది. అందుకే సుకుమార్ కాస్త రీసెర్చ్ చేసి, సెర్చ్ చేసి మరీ ఈ పేరు పెట్టినట్టున్నారు. టైటిల్ ప్రకటించగానే ఈ సినిమాకు దానికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయంలో చాలా మంది రకరకాల వెర్షన్స్ వినిపించారు. కొంతమంది ఈ సినిమాలో హీరోయిన్ పేరు ‘పుష్ప’ అని, మరికొంత మంది బన్నీ నడిపే లారీ పేరు ‘పుష్ప’ అని, ఇంకొంత మంది ఈ సినిమాలో బన్నీ పేరు పుష్పక్ నారాయణ్ అని చెబుతున్నారు. నిజానికి నిన్న ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను విడుదల చేసినప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘పుష్ప రాజ్’ అని రాసింది. అయితే, ఇవన్నీ కరక్టేనట. అదెలా సాధ్యం అనే డౌట్ వస్తే దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఈ సినిమా కథ గురించి తెలుసుకోవాలి. Also Read: ఈ చిత్ర యూనిట్‌లోని ఇన్‌సైడర్స్ ద్వారా సినిమా లైన్ దాదాపుగా లీక్ అయ్యింది. వాళ్ళు అందించిన వివరాల ప్రకారం ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది ఇప్పడు చూద్దాం. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చూపించినట్టుగానే శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. అక్కడ అల్లు అర్జున్.. రాజు అనే పేరుతో పరిచయం అవుతారట. రాజు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ఒక గ్రూప్‌కి సపోర్ట్‌గా ఉంటాడట. మిగిలిన స్మగ్లింగ్ గ్రూప్స్‌ని అడ్డుకుంటూ అక్కడ లోకల్ పొలిటీషియన్స్‌కి దగ్గర అవుతాడట. ఈ నేపథ్యంలో అక్కడ అల్లు అర్జున్‌కి పరిచయం అయ్యే హీరోయిన్ పేరు పుష్ప. అదే పేరు రాజు తన లారీకి పెట్టుకుంటాడట. ఈ సినిమాలో బన్నీలో రెండో షేడ్ ఉంటుందట. ఈ కథ ఫారెన్ బ్యాక్ డ్రాప్‌లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ బన్నీ పేరు పుష్పక్ నారాయణ్ అట. అక్కడ ఒక స్టైలిష్ బిజినెస్ మ్యాన్‌గా కనిపిస్తాడట బన్నీ. అలాగే, మూడో షేడ్ సినిమాకి హార్ట్ లాంటిది అని అంటున్నారు. ఈ షేడ్‌లో బన్నీ ఒక ఇన్వెస్టిగేషన్ లేదా ఒక స్పెషల్ ఆఫీసర్‌గా కనిపిస్తారట. ఇలా ‘పుష్ప’లో మొత్తం మూడు షేడ్స్‌లో బన్నీ కనిపిస్తారట. మూడు షేడ్స్ ఉన్నా బన్నీ సోలో రోల్‌లోనే ఉంటారని సమాచారం. మరి ఈ మూడు క్యారెక్టర్స్‌ని సుకుమార్ తన మ్యాజికల్ స్క్రీన్ ప్లేతో ఎలా కలిపారు అనేది సినిమాలో చూడాలంటున్నారు. అయితే, బయటికి వచ్చిన ఈ కథ వల్ల ‘పుష్ప’కి ‘రంగస్థలం’కి ఎలాంటి పోలిక లేదు అనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VcWuVC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...