Wednesday, 22 April 2020

క్వారంటైన్ టైమ్‌‌లో ఎన్టీఆర్.. ఫోకస్ అంతా దానిపైనే!

దేశంలో కరోనా చేస్తున్న విలయతాండవం సెలబ్రిటీలందరినీ ఇళ్లకే పరిమితం చేసేసింది. లాక్‌డౌన్ విధించడంతో షూటింగ్స్ అన్నీ బంద్ చేసుకొని ఆ సమయాన్నంతా ఇంట్లోనే గడుపుతున్నారు హీరోహీరోయిన్లు. కాకపోతే ఈ క్వారంటైన్ సమయాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా వినియోగించుకుంటున్నారు. మొన్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటనలో స్పెషల్ శిక్షణ తీసుకుంటున్నట్లు స్వయంగా పేర్కొనగా, తాజాగా ఈ క్వారంటైన్ టైమ్‌‌లో మలయాళీ భాష నేర్చుకుంటున్నారని తెలుస్తోంది. అదేంటి? తారక్‌ మలయాళీ ఎందుకు నేర్చుకుంటున్నారనే కదా మీ సందేహం. అదేనండీ.. కోసమే. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న RRR సినిమా కోసం తారక్ మలయాళీ భాషపై ఫోకస్ పెట్టారట. ఎలాగూ క్వారంటైన్ టైమ్‌‌ కాబట్టి ఆ భాషలో మెళకువలు నేర్చుకుంటున్నారట ఎన్టీఆర్. ఇటీవలే RRR నుంచి 'భీమ్ ఫ‌ర్ రామ‌రాజు' అంటూ వీడియో ప్రోమో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ప్రోమోలో తార‌క్ వాయిస్ ఓవ‌ర్ విన్నాం. ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ ప్రోమోల‌కు మ‌ల‌యాళం త‌ప్ప మిగిలిన భాష‌ల‌కు తార‌క్ డ‌బ్బింగ్ చెప్పారు. అయితే ఈ ఖాళీ సమయంలో మ‌ల‌యాళం కూడా నేర్చుకుని RRR మలయాళీ డబ్బింగ్‌ చెప్పేందుకు రెడీ అవుతున్నారట ఎన్టీఆర్. Also Read: RRR అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఫుల్ నేమ్ 'రౌద్రం ర‌ణం రుధిరం' అని ఇటీవలే ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ రోల్ పోషిస్తున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేశారు జక్కన్న.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yDwkDK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...