Wednesday, 22 April 2020

ప్రముఖ హీరోకి పితృవియోగం.. అంత్యక్రియలకు కూడా వెళ్లలేని పరిస్థితి!

బాలీవుడ్ సీనియర్ హీరో, రాజ్యసభ మాజీ సభ్యుడు తండ్రి మరణించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు. వయసు మీద పడటంతో కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బసంత్ కుమార్ చక్రవర్తి మంగళవారం రాత్రి ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతూ కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మిథున్ చక్రవర్తి ప్రస్తుతం బెంగళూరులో ఉండటంతో తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో ఆయన కర్ణాటక దాటి రాలేని పరిస్థితి. రైళ్లు, విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం, ప్రైవేట్ వాహనాలను రాష్ట్ర సరిహద్దులు దాటనీయక పోవడం కారణంగా మిథున్ చక్రవర్తి అక్కడే చిక్కుకుపోయారు. కనీసం తండ్రిని ఆఖరిచూపు కూడా చూడలేని పరిస్థితి నెలకొంది. అయితే బెంగళూరు నుంచి ముంబైకి వచ్చేందుకు మిథున్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని తమ్ముడు నిమాషి పేర్కొన్నారు. మిథున్‌ చక్రవర్తి తండ్రి బసంత్ కుమార్ చక్రవర్తి మరణవార్త తెలిసి పలువురు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ వేత్తలు తమ తమ సంతాపాన్ని తెలుపుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eMkNTd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...