Monday, 27 April 2020

అప్పుడలా ఎంజాయ్ చేసేవాన్ని కానీ ఇప్పుడు.. కారణమేంటో రేపు చెప్తా: చిరంజీవి

ఇటీవలే సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన యమ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు సందేశాలు పోస్ట్ చేస్తూ సామాజిక మాద్యల్లోనూ తనదైన మార్క్ చూపిస్తున్నారు. యంగ్ హీరో హీరోయిన్స్ కంటే ఆయన జోరే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి చేసిన ఓ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ విషయం గురించి ప్రస్తావించిన ఆయన కారణం రేపు చెప్తా అంటూ ట్విస్ట్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ''సాధారణంగా నా సినిమాలకి సంబంధించిన పాటలను షూటింగ్ చేస్తుండగానే పూర్తిగా విని ఎంజాయ్ చేస్తుంటాను. మధ్యలో ఆపడానికి అస్సలు ఇష్టపడను. కానీ ఇప్పుడు మాత్రం ఒక పాటను తరచూ పాజ్ చేస్తూ.. మళ్లీ మొదటి నుంచి వింటూ ఎంజాయ్ చేస్తున్నాను. అందుకు కారణం ఏంటో రేపు ఉదయం 9 గంటలకు చెబుతాను" అని ట్వీట్ చేసి అందరినీ ఆకర్షించారు చిరంజీవి. దీంతో రేపు ఆయన ఏం చెప్పబోతున్నారా? అనే క్యూరియాసిటీని జనాల్లో పెరిగింది. అయితే చిరంజీవి ప్రస్తావిస్తున్న ఆ పాట '' సినిమా లోనిదే అయి ఉంటుందని చెప్పుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 152వ సినిమాగా ఈ మూవీ రూపొందుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే కొద్దిభాగం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ తదుపరి షెడ్యూల్స్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. ఈ టైమ్‌లో చిరు చేసిన ఈ ట్వీట్ మెగా అభిమానుల్లో ఆతృత పెంచేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35acj3Q
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...