Wednesday, 1 April 2020

నేను 8, ఆమె 10.. లవ్ యూ చెప్తే రాఖీ కట్టింది: విశ్వక్ సేన్

‘హిట్’ చిత్రంతో నటుడిగా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించారు యువ హీరో . ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో.. పక్కా హైదరాబాదీ నేటివిటీతో ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రాన్ని రూపొందించారు. అతనే దర్శకత్వ ప్రతిభ చూపిస్తూ ఆ సినిమాలో హీరోగా నటించారు. ఆ సినిమా హిట్టా ఫట్టా అనే విషయాన్ని పక్కనపెడితే హిట్, ఫలక్ నుమా దాస్ చిత్రాలతో హీరోగా ఐడెండిటీ ఏర్పరుకున్నారు విశ్వక్ సేన్. ఇక మనోడి నోటి దురుసు కాస్త ఎక్కువే కావడంతో పలు వివాదాస్పద కామెంట్స్‌తో తక్కువ కాలంలో వర్మ శిష్యుడిగా మారారు. మనోడు మైక్ అందుకున్నాడంటే అది ఏ ఈవెంట్ అయినా సరే.. బూతు మేత వేస్తుంటాడు. తాజాగా విశ్వక్ సేన్ ఈటీవీ 2లో ప్రసారం అవుతున్న ‘నీకు మాత్రమే చెప్తా’ టాక్ షోలో తన చిన్న నాటి ప్రేమకథను చెప్పాడు. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘నీకు మాత్రమే చెప్తా’ హోస్ట్ చేస్తున్నారు. ఆయనకు ఇదే తొలి టాక్ షో కావడం విశేషం. కాగా ఈ షోలో పాల్గొన్న విశ్వక్ సేన్ తన చిన్ననాటి లవ్ మ్యాటర్ బయటపెట్టాడు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించావ్.. మ్యాటర్‌లు ఏం లేవా? అంటే ఈ చిన్ననాటి ప్రేమకథ బయటకు వచ్చింది. విశ్వక్ సేన్ 8వ తరగతిలో ఉన్నప్పుడే ఓ అమ్మాయిని లవ్ చేశాడట.. అయితే ఆమె తనకంటే రెండేళ్లు సీనియర్. మనోడు 8వ తరగతి అయితే ఆమె 10 తరగతి. తరగతి పెద్దదని మనోడు అస్సలు తగ్గకుండా వెళ్లి ప్రపోజ్ చేశాడట. ఇంకేం ఉంది మ్యాటర్ క్లాస్ టీచర్‌కి తెలియడంతో ఇద్దర్నీ ఆఫీస్ రూంకి పిలిచారట. అక్కడే విశ్వక్ సేన్‌కి ఆ అమ్మాయితో రాఖీ కట్టించి కథ సుఖాంతం చేశారట. ఈ చిన్ననాటి ప్రేమకథ బయటకు రాకూడదు అనుకున్నా కాని.. ఇదిగో ఇలా బయటకు వచ్చేసిందంటూ తన ఎనిమిదో తరగతి లవ్ స్టోరీని చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JwTWwg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...