Thursday, 5 March 2020

O Pitta Katha: సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్.. అన్నా ఇకచూస్కో బాక్సాఫీస్ బద్దలే!

సీనియర్ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు ‘ఓ పిట్ట కథ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించారు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతాన్ని అందించాడు. మార్చి 6న ఈ సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకావడంతో సినిమాకు విపరీతమైన హైప్ వచ్చేసింది. ఆ తర్వాత యంగ్ రెబెల్ స్టా్ర్ ప్రభాస్ కూడా ట్వీట్ చేస్తూ సినిమాకు సపోర్ట్ చేసారు. READ ALSO: ‘ఓ పిట్టకథ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంజయ్‌కి బెస్ట్ విషెష్.. అలాగే మై డార్లింగ్ బ్రహ్మాజీకి, భవ్యా క్రియేషన్స్‌కి టోటల్ టీంకి ఆల్ ది బెస్ట్’ అంటూ ప్రభాస్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసారు. ఇప్పుడు యంగ్ టైగర్ కూడా సినిమాకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసారు. ‘సంజయ్‌కి నా స్నేహితుడు బ్రహ్మాజీకి, రేపు రిలీజ్ అవ్వబోతున్న ఓ పిట్ట కథ టీంకి బెస్ట్ విషెస్’ అని తారక్ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌కు బ్రహ్మాజీ రిప్లై ఇస్తూ.. ‘అన్నా ఈ మాట కోసం వెయిటింగ్..ఇక చూస్కో బాక్సాఫీస్ బద్దలే. థ్యాంక్యూ డియర్. నాకోసం ఎప్పుడూ సపోర్ట్ చేసావు. లవ్యూ ఫరెవర్’ అన్నారు. దాదాపు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఎందరో సెలబ్రిటీలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. అందుకే ఆయన అడగ్గానే ప్రతీ ఒక్కరూ వచ్చి సంజయ్‌ను సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు బాగా హైప్ వచ్చేసింది. చాలా మంది చిరంజీవి చెయ్యి మంచిది అంటుంటారు. నాగశౌర్య నటించిన దాదాపు రెండు సినిమాలకు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వచ్చి ఆశీర్వదించారు. దాంతో ఆయన సినిమాలు రెండూ మంచి విజయం అందుకున్నాయి. యువ హీరో నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా కూడా పలుమార్లు వాయిదా పడింది. దాంతో నిఖిల్ చాలా బాధపడ్డారు. అసలు రిలీజ్ అవుతుందో లేదో అనుకుంటున్న సమయంలో చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వచ్చి టీంను ఆశీర్వదించారు. అర్జున్ సురవరం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇప్పుడు సంజయ్‌కు కూడా మెగాస్టార్ ఆశీస్సుల వల్ల తొలి సినిమా మంచి హిట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TCGefO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...