Thursday, 5 March 2020

రవిబాబు ‘క్రష్’కి కరోనా ఎఫెక్ట్.. మాస్క్‌లతో ముద్దులు

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ భయం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, భయాందోళనలను పక్కనబెట్టి ముందు జాగ్రత్తగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని, భద్రంగా ఉండాలని ప్రభుత్వాలు, వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే ముఖానికి మాస్క్‌లు ధరించాలని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే బయట తిరిగే చాలా మంది మాస్క్‌లు ధరిస్తున్నారు. అయితే, ఈ కరోనా వైరస్ భయాన్ని, మాస్క్‌లను తన సినిమా ప్రచారానికి వాడుకుంటున్నారు దర్శక నిర్మాత రవిబాబు. సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్‌పై స్వీయ దర్శకత్వంలో ర‌విబాబు నిర్మిస్తోన్న చిత్రం ‘క్రష్’. జనవరి 1న ఈ సినిమా టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. అప్పట్లో టైటిల్ పోస్టర్ బాగా పాపులర్ అయ్యింది. యువతను టార్గెట్ చేస్తూ ఈ సినిమా తీస్తున్నట్టు టైటిల్ పోస్టర్ ద్వారా చెప్పేశారు రవిబాబు. బికినీలో ఒక అమ్మాయి బీచ్‌లో నడుస్తూ వస్తుంటే ముగ్గురు కుర్రాళ్లు ఆమెను చూసి సొంగ కారుస్తున్నట్టు పోస్టర్‌లో చూపించారు. అయితే, ఆ అమ్మాయి ముఖం కానీ, అబ్బాయిల మొహాలు కానీ ఆ పోస్టర్ చూపించలేదు. తాజాగా మరో రెండు పోస్టర్లను రవిబాబు వదిలారు. ఒక పోస్టర్‌లో జిమ్‌లో వర్కౌట్ చేస్తోన్న అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. కానీ, ఈ పోస్టర్‌లోనూ వాళ్ల ముఖాలు చూపించలేదు. ముఖాలను మాస్క్‌లు వేశారు. మరో పోస్టర్‌లో అమ్మాయి, అబ్బాయి ముద్దు పెట్టుకోవడానికి పెదాలు దగ్గరగా వచ్చినట్టు ఉంది. కానీ, ఇక్కడ కూడా అమ్మాయి అబ్బాయికి మాస్క్‌లు వేశారు. అంతేకాదండోయ్.. రెండు పోస్టర్లపైనా ‘బి సేఫ్’ అని రాశారు. Also Read: తన సినిమా ప్రచారంతో పాటు ముఖాలకు మాస్క్‌లు ధరించండి అనే మెసేజ్‌ను కూడా రవిబాబు ఈ పోస్టర్ల ద్వారా ప్రజలకు అందించారు. అసలు తన సినిమా ప్రమోషన్ కోసం కరోనా వైరస్ భయాన్ని, మాస్క్‌లను వాడుకోవాలని రవిబాబుకు వచ్చిన ఆలోచన ఉంది చూడండి.. హ్యాట్సాఫ్. కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. వేసవిలో సినిమాను విడుదల చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IjpKE8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...