Friday, 13 March 2020

NBK 106: జోరుమీదున్న బాలయ్య.. ఎమోషన్‌కు పెద్దపీట వేస్తోన్న బోయపాటి

నటసింహా నందమూరి బాలకృష్ణ మంచి జోరుమీదున్నారు. తన 106వ చిత్రానికి సంబంధించి మొదటి షెడ్యూల్ షూటింగ్‌ను అప్పుడే పూర్తిచేసేశారు. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో మొదటి షెడ్యూల్ షూటింగ్‌ను మొదలుపెట్టారు. అయితే, ఈ షెడ్యూల్ పూర్తయినట్టు దర్శకుడు బోయపాటి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘ఎమోషనల్ సీక్వెన్స్‌తో తొలి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేశాం. తరవాత షెడ్యూల్ కోసం సన్నాహాలు చేస్తున్నాం’’ అని బోయపాటి శ్రీను తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, తరవాత షెడ్యూల్ కూడా హైదరాబాద్‌లోనే మొదలుకానుంది. ఈ సినిమాలో అంజలి నటిస్తున్నట్టు సమాచారం. ఇదే గనుక నిజమైతే ‘డిక్టేటర్’ తరవాత బాలకృష్ణతో అంజలి నటించడం ఇది రెండోసారి అవుతుంది. ఇక బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు బాలయ్య 106 సినిమాతో మూడోసారి వీరిద్దరూ జతకట్టారు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. Also Read: ఈ సినిమాలో దర్శకుడు బోయపాటి శ్రీను ఎమోషన్స్‌కు పెద్దపీట వేస్తున్నట్టు సమాచారం. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాలయ్య సినిమాను ఎంజాయ్ చేసేలా తీర్చిదిద్దుతున్నారట. తొలి షెడ్యూల్‌లో ఇలాంటి ఎమోషనల్ సీక్వెన్స్‌నే బోయపాటి చిత్రీకరించారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం బాలయ్య ఫామ్‌లో లేరు. ‘లయన్’ దగ్గర నుంచి ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టులేకపోయింది. ఆఖరికి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘యన్.టి.ఆర్’ సినిమాలు సైతం కమర్షియల్‌గా హిట్ కాలేదు. ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వరుసగా రెండు చిత్రాలు (జైసింహా, రూలర్) చిత్రాలు చేసినా వర్కౌట్ కాలేదు. దీంతో ఇప్పుడు బాలయ్య ఆశలన్నీ బోయపాటి సినిమాపైనే ఉన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2vnxvWS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...