Friday, 13 March 2020

‘రెడ్’ బ్యూటీకి ఫాలోయింగ్ ఎక్కువే.. అందుకే ఆరబోస్తోంది!

అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. కొంత మంది హీరోయిన్లు మంచి నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటారు. అలాంటి హీరోయిన్లు కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితమవుతుంటారు. మరికొంత మంది హీరోయిన్లు అభినయం లేకపోయినా అందంతో కట్టిపడేస్తుంటారు. ఎక్స్‌పోజింగ్‌తో యూత్‌ను ఆకర్షిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి ఏ సినిమాలో అయినా పాత్రలు దక్కుతాయి. కానీ, ఈ రెండు లక్షణాలు ఉన్న హీరోయిన్లు మాత్రం తక్కువగా ఉంటారు. అలాంటి నటే మాళవిక శర్మ. ‘నేల టిక్కెట్’ మూవీలో మాస్ మహరాజా రవితేజతో మాళవిక శర్మ ఆడిపాడింది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయిన ఈ అమ్మాయి నటనకు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు ఇస్మార్ట్ హీరో రామ్ సరసన ‘రెడ్‌’ సినిమాలో నటిస్తోంది. ‘రెడ్’ సినిమా తనకు తప్పకుండా మంచి గుర్తింపును తెచ్చిపెడుతోందని మాళవిక హోప్స్ పెట్టుకుంది. ఈమెకు సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 6.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తన అభిమానులను సంతోషపెట్టడానికి ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. కాగా, ‘రెడ్’ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘నువ్వే నువ్వే’ సాంగ్‌లో మాళవిక చాలా అందంగా కనిపించి అందరి దృష్టిలో పడింది. ఈ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో అందాలు ఆరబోస్తోంది. ఈ అమ్మడు పెట్టిన ఫొటోలకు లైక్స్, కామెంట్స్ లిస్ట్ పెద్దదే. తన టాలెంట్, బ్యూటీ‌తో మరింత గుర్తింపు తెచ్చుకోవాలని మాళవిక భావిస్తోంది. ఏప్రిల్ 9న ‘రెడ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తర్వాత మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. మంచి పాత్రలు, కథల ఎంపికలో ఉన్న మాళవిక త్వరలో వాటి వివరాలు స్వయంగా ప్రకటించనుంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U2qjI3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...