Saturday, 21 March 2020

కరోనా ఎఫెక్ట్... దుబాయ్‌లోనే ఆగిపోయిన ప్రముఖ సింగర్

ఎఫెక్ట్‌ సినీ ప్రముఖలపై బాగా చూపిస్తుంది. ఇప్పటికే అగ్ర హీరోలంతా తమ షూటింగ్స్‌ను బంద్ చేసుకున్నారు. విదేశాల్లో నుంచి వచ్చి సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. కొందరు అయితే ఇంట్లోవారితో ఆనందంగా గడుపుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ సింగర్‌ది కూడా ఇదే పరిస్థితి. సింగర్‌కు తాకంది. సోనూ నిగమ్ ఇండియాకు రావాల్సిన ఫ్లైట్ రద్దు అయ్యింది. గత రాత్రి ఆయన దుబాయ్ నుండి ఇండియాకి రావలసి ఉండగా, ఆ ఫ్లైట్ రద్ధైంది. దీంతో దుబాయ్‌లో తన ఫ్యామిలీతో ఉన్నట్టు వీడియో ద్వారా తెలిపాడు సోను. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితిల్లో ఇండియాకు వచ్చిన ఆయన.. 14 రోజులపాటు క్వారంటైన్స్‌లో ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో నేను బహుశా సాధారణ జీవితాన్ని గడపలేను. దీంతో కొద్ది రోజులు దుబాయ్‌లో నా కుటుంబంతో కలిసి ఉంటాను అంటున్నాను సోను. వాతావరణం అంతా తిరిగి మామూలుగా మారినప్పుడే... తిరిగి ఇండియా వస్తానంటూ.. అతని ఫ్యాన్స్, స్నేహితుల అడిగిన ప్రశ్నలకి వీడియో ద్వారా బదులిచ్చాడు. తన సోషల్ మీడియా పేజీల్లో బ్రేక్ కరోనా హ్యాష్ టాగ్ పేరుతో ఓ పోస్టు కూడా పెట్టాడు సోను నిగమ్. ఈ సమయంలో అంతా ఐక్యత, నిబద్ధతగా ఉండాలన్నాడు. ఇంటికే పరిమితం అయ్యి సురక్షితంగా ఉండాలని కోరాడు. పరిస్థితులు మెరుగుపడే వరకు సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నాడు. దీంతో పాటు ఓ ప్రముఖ ఆస్పత్రి కరోనా నేపథ్యంలో ఇచ్చిన గైడ్ లైన్స్ పోస్టు చేసి వాటిని ఖచ్చితంగా పాటించాలని కోరాడు సోను నిగమ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bg2Gm9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...