Saturday, 21 March 2020

తనకు పార్ట్ నర్ దొరికారంటన్న అదా శర్మ... ఇంతకీ ఎవరు తెలుసా?

‘హార్ట్ ఎటాక్’అంటూ వెండితెరపై మెరిసింది అదా శర్మ. ఆ తర్వాత ‘క్షణం’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బన్నీతో కూడా కలిసి ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’మూవీలో కనిపించింది. అయితే ఇప్పుడు ఆదా శర్మకు తెలుగులో పెద్దగా సినిమాలు లేవు. దీంతో అటు బాలీవుడ్ లో మాత్రం వరసగా సినిమాలు చేస్తున్నది. బాలీవుడ్ లో ఈ అమ్మడు కమాండో 3 వంటి యాక్షన్ మూవీలో కూడా నటించింది. సినిమాలు ఉన్న లేకపోయినా ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.రోజూ ఏదో ఓ పోస్టు పెడుతూనే ఉంటుంది. తాజాగా ఈ ముద్దగుమ్మ పెట్టిన పోస్టు ఒక్కసారిగా వైరల్ అయ్యింది. మీకు తెలిపేందుకు సంతోషంగా ఉంది.. ‘ ఐ ఫౌండ్ మై పార్టనర్’ అంటూ ఓ వీడియోను అదా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. దీంతో వెంటనే ఆమె అభిమానులు, నెటిజన్స్ అంతా... ఎవరా అని తెలుసుకునేందుకు ఉత్సాహం చూపించారు. అయితే ఇన్‌స్టాలో పోస్టు చేసిన వీడియోలో అదా భాగస్వామిని చూసినవాళ్లకు మాత్రం షాక్ తగిలింది. ఆ వీడియోలో అదాశర్మతో పాటు మరొకరు డాన్స్ వేస్తున్నారు. వాళ్లు మరెవరో కాదు. అదాశర్మనే. అవును... అదా అద్దం చూస్తూ డాన్స్ వేసింది. అద్దంలో తన ప్రతిబింబమే.. తన పార్టనర్ అంటూ అర్థం వచ్చేలా ఈ ముద్దుగుమ్మ పోస్టు పెట్టింది. దీంతో అదా వీడియో చూసినవారంతా ఏంటి అదా ఇంత షాక్ ఇచ్చావ్ అంటున్నారు. ఆమె ఈ పోస్టు పెట్టిన అరగంటలోనే 40వేల మంది ఈ వీడియోను చూడటం విశేషం. మార్షల్ ఆర్ట్స్ లో అదాకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాన్ చాక్, కర్రసాము వంటివి కూడా ఈ భామ నేర్చుకుంటోంది. అదే విధంగా డ్యాన్స్ లోను మంచి ప్రవేశం ఉన్నది. కథక్ లో ఇప్పటీకే డిగ్రీ చేసింది అదా. అయితే అదాపై గతంలో డేటింగ్ పుకార్లు వచ్చాయి. ఆమె ఓ బిజినెస్ మేన్‌తో డేటింగ్‌లో ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పుకార్లును అదా కొట్టి పారేసింది. తనకు ఏ బిజినెస్‌మ్యాన్ తేలియదంది. అసలు తనకు అంత టైం కూడా లేదంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UjlCte
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...