Tuesday, 24 March 2020

లండన్ నుంచి వచ్చి శృతిహాసన్.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో కమల్ ఫ్యామిలీ

లోకనాయకుడు కమల్ హాసన్ పెద్ద కుమార్తె, హీరోయిన్ శృతిహాసన్ 10 రోజుల క్రితం లండన్‌ నుంచి ముంబైకి వచ్చారు. అప్పటి నుంచి ఆమె సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులు కమల్ హాసన్, తల్లి సారిక, చెల్లులు అక్షర హాసన్ కూడా వేర్వేరు ఇళ్లలో సెల్ఫో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని శృతిహాసన్ స్వయంగా వెల్లడించారు. ఇలా ఒక ఇంట్లో ఒంటరిగా ఉండటం తనకు కష్టమేమీ కాదని.. అందరిలానే తాను ఉండగలని శృతి హాసన్ అన్నారు. ఈ మేరకు ఆమె ‘ముంబై మిర్రర్’తో మాట్లాడారు. గదిలో ఖాళీగా ఉంటున్న శృతిహాసన్ వంట చేయడం, బేక్ చేయడం, ఆర్గానిక్ సోప్స్ తయారుచేయడం వంటివి చేస్తున్నారట. బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం కష్టమైన పని కాదని, బయట ఏం జరుగుతుందో దానిపై భయం ఉండాలని అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో జనసమూహానికి దూరంగా ఉండటం ఎంత ముఖ్యమో శృతి వివరించారు. ‘‘గడిచిన కొన్ని రోజులుగా ప్రజలు కరోనాను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. దేవుడి దయవల్ల నేను ముందుగానే తిరిగి వచ్చేశాను. షూటింగ్‌లు కూడా రద్దయ్యాయి’’ అని శృతిహాసన్ వెల్లడించారు. Also Read: ‘‘మా ఫ్యామిలీ మొత్తం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంది. అమ్మ ముంబైలోనే వేరే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. నాన్న, అక్షర చెన్నైలో వేర్వేరు ఇళ్లలో ఒంటరిగానే ఉంటున్నారు. మేమందరం ప్రయాణాలు కూడా వేర్వేరేగానే చేశాం. అంతా కలిసి ఒకే ఇంట్లో ఉండకూడదు అని నిర్ణయించుకున్నాం. మిగిలిన వాళ్లు ఇలాంటి నిర్ణయాలే తీసుకోవాలి’’ అని శృతి అన్నారు. కొంత మందికి ఇప్పటికీ పరిస్థితి అర్థం కావడంలేదని, జనసమూహానికి దూరంగా ఉండటం లేదని శృతి అసహనం వ్యక్తం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aaNOW5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...