Tuesday, 24 March 2020

చిరంజీవి కీలక నిర్ణయం... ఉగాది నుంచే ప్రారంభం

తీసుకున్నారు. ఇక నుంచి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు చిరు ప్రకటించారు. ఇక నుంచి తాను కూడా సోషల్ మీడియాలో ఎంటర్ అవుతానన్నారు. ఎప్పటికప్పుడు తన భావాల్ని అభిమానులతో షేర్ చేసుకుంటానన్నారు. తాను అనుకున్న మెసేజ్‌లు, చెప్పాలనుకున్నవాటిని ప్రజలతో చెప్పుకోవడానికి సోషల్ మీడియానే వేదిక అన్నారు. అందుకే ఈ ఉగాది రోజు నుంచి తాను సోషల్ మీడియాలోకి ఎంటర్ ఇస్తున్నానన్నారు మెగాస్టార్. ఇప్పటివరకు చిరుకు ఎలాంటి సోషల్ మీడియా ఎకౌంట్స్ లేవు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటివి చిరంజీవి ఫాలో అవ్వడం లేదు. ఏమైనా ఉన్నా కూడా వాటిని కేవలం కొణిదెల ప్రొడక్షన్‌కు సంబంధించిన అఫిషియల్ పేజీల్లో మాత్రమే చెబుతున్నారు. వీడియోలు లాంటివి తన అభిమానుల కోసం పోస్టు చేస్తుంటారు. దీంతో ఇప్పుడు చిరు సోషల్ మీడియాలోకి రావాలని డిసైడ్ అయ్యారు. చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఆయన గురించి ఏ చిన్న అప్ డేట్ వచ్చిన ఫ్యాన్స్ ఖుషీగా ఫీల్ అవుతుంటారు. చిరుకు సంబంధించిన విషయాలు, విశేషాలు తెలుసుకునేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు ఏకంగా చిరంజీవి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో వస్తున్నారన్న వార్త విని మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఉగాది రోజు చిరు సోషల్ మీడియాలోకి రాగానే... ఎంతమంది ఫాలోవర్స్ వస్తారో చూడాలి. ఇప్పటికే టాలీవుడ్ అగ్రహీరోలందరికీ సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. చిరుయే ఈ విషయంలో కాస్త లేట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UicAhH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...