Tuesday, 17 March 2020

త్వరలో ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

కరోనా వైరస్ భయంతో టాలీవుడ్‌లో షూటింగ్‌లు అన్నీ ఆగిపోయినా.. రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం అనుకున్న సమయానికి తన సినిమా షెడ్యూల్‌ను పూర్తిచేశారు. ప్రస్తుతం ఆయన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇది ప్రభాస్‌కు 20వ సినిమా. ‘ఓ డియర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రానికి సంబంధించి అప్‌డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఉన్నారు. మొత్తానికి వాళ్ల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. ప్రభాస్ 20వ సినిమా ఫస్ట్ లుక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ఆ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ‘‘మరో షెడ్యూల్ పూర్తిచేశాం. ఈ షెడ్యూల్‌ను త్వరితగతిన పూర్తిచేయడానికి సహకరించిన జార్జియన్ టీమ్‌కు కృతజ్ఞతలు. మీరంతా చాలా మంచివారు. ప్రభాస్ 20వ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో వస్తుంది’’ అని తన ట్వీట్‌లో రాధాకృష్ణ కుమార్ పేర్కొన్నారు. ‘సాహో’ తరవాత వస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇది కూడా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరిగింది. ఆ తరవాత షెడ్యూల్ కోసం జార్జియా వెళ్లారు. అదే సమయంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో త్వరగా షూటింగ్‌ను పూర్తిచేశారు. నిజానికి ఇంకో 20 రోజుల షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. కానీ, జార్జియాలో కూడా కరోనా భయం ఉండటంతో షూటింగ్ పూర్తిచేసి చిత్ర యూనిట్ తిరుగు ప్రయాణం అయ్యింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TV7PdB
v

No comments:

Post a Comment