Tuesday, 17 March 2020

సాయి తేజ్ సినిమాలో రమ్యకృష్ణ.. పవర్‌ఫుల్ పొలిటీషియన్!

ఒకప్పుడు దక్షిణాదిలో పవర్‌ఫుల్ యాక్ట్రెస్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న రమ్యకృష్ణ.. మళ్లీ రాజమౌళి ‘బాహుబలి’ చిత్రంతో ఫామ్‌లోకి వచ్చారు. ఆ సినిమాలో చేసిన రాజమాత శివగామీదేవి పాత్ర రమ్యకృష్ణను మరోసారి అందలానికి ఎక్కించింది. ఈ సినిమా తరవాత మళ్లీ రమ్యకృష్ణకు అవకాశాలు పెరిగాయి. తెలుగు, తమిళ భాషల్లో ఆమె వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. తెలుగులో చివరిగా ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలో రమ్యకృష్ణ కనిపించారు. పవర్‌ఫుల్ లేడీగా, అత్తగా నటించారు. కానీ, ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే, రమ్యకృష్ణ ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా ‘ప్రస్థానం’ ఫేం దేవాకట్టా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొబ్బరికాయ కొట్టి ఈ సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పొలిటీషియన్ రోల్‌లో రమ్యకృష్ణ కనిపిస్తారట. ఇదే నిజమైతే మరోసారి రమ్యకృష్ణ నట విశ్వరూపాన్ని వెండితెరపై చూసేయొచ్చు. Also Read: కాగా, పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ దత్ సినిమాటోగ్రపీ అందిస్తున్నారు. ఇది సాయి ధరమ్ తేజ్‌కు 14వ సినిమా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TZcNWJ
v

No comments:

Post a Comment