Tuesday, 10 March 2020

విజయ్ దేవరకొండవైపుకు గాలి మళ్లించిన శ్రీరెడ్డి.. ఇలా చేస్తున్నాడంటూ

అయ్యో.. రామా!! పాపం ఏం చేశాడు? నిన్ననే కదా.. ఈ ముద్దుల వీరుడు ‘షేక్ హ్యాండ్ వద్దు నమస్కారం ముద్దు’ అంటూ ఎంతో పద్దతిగా రెండు చేతులు జోడించి.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చాడు. కరోనా వైరస్ పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో ప్రజలకు వివరిస్తూ.. ‘తరుచుగా చేతిని సబ్బుతో కడుక్కోండి. మీ కళ్లని, ముక్కు, నోటిని, చెవిని చేతితో తాకకండి. ఎవరైనా దగ్గుతూ, తుమ్ముతూ ఏంటే వాళ్ల నుంచి కనీసం మూడడుగుల దూరంలో ఉండండి. రద్దీ ప్రాంతాలకు వెళ్లకండి. మనమందరం కరోనా వైరస్‌ను అరికట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎవరికైనా ఈ వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే 104 నెంబర్‌కు కాల్ చెయ్యండి’ అంటూ పలుపునిస్తూ వీడియో విడుదల చేశారు. పబ్లిక్ సేఫ్టీ‌‌పై అవగాహన కల్పిస్తూ.. కరోనాఫై ఫైటింగ్ ప్రకటించాడు ఈ ‘ఫైటర్’. సరే.. మొత్తానికి ఈ క్రేజీ హీరో కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు తన వంతుగా ప్రయత్నం చేయడంతో అందరూ అభినందిస్తున్న తరుణంలో వివాదాస్పద నటి మనోడిని టార్గెట్ చేసింది. కాపీ క్యాట్ అంటూ ఓ పోస్ట్ వదిలింది. విజయ్ దేవరకొండ ఏంటి? కాపీ కొట్టడం ఏంటి? జిరాక్స్ కాపీ చేసేటంతగా విజయ్ ఏం చేశారబ్బా అంటే.. మన టాలీవుడ్ అర్జున్ రెడ్డి బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌ను కాపీ కొడుతున్నాడంటూ ఫీల్ అవుతుంది శ్రీరెడ్డి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ వదిలింది. ‘విజయ్ దేవరకొండ మిమ్మల్ని నేను చాలా ఇష్టపడతా.. దయచేసి మీరు మీలా ఉండండి.. ఆ రణ్‌వీర్ సింగ్‌ని కాపీ కొట్టకండి. జిరాక్స్ కాపీ వద్దు.. విజయ్‌లా ఉంటే చాలు’ అంటూ పోస్ట్ పెట్టింది. పొగిడినట్టే పొగిడి తిడుతున్నారా మేడమ్.. అయినా మావాడు కాపీ కొడితే మీకెందుకు మేడమ్ అంటూ విజయ్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని లుక్స్.. ఇంచు మంచు రణ్‌వీర్‌ని కాపీ కొట్టినట్టుగానే ఉన్నాయి.. పెరిగిన జుట్టుతో పిట్టలదొర టోపీతో వరల్డ్ ఫేమస్ లవర్ అప్పుడు హల్ చల్ చేశాడు విజయ్. ఆ గెటప్ అప్పట్లో రణ్‌వీర్ సింగ్‌దే. దీంతో పాటు ఈ తరువాత వచ్చిన పలు లుక్స్ కూడా ఇంచుమించి రణ్ వీర్ సింగ్ మాదిరిగానే ఉన్నాయి. బహుషా అందుకేనా శ్రీరెడ్డి.. విజయ్‌ని కాపీ కొడుతున్నాడని అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cLfS3X
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...