Wednesday, 11 March 2020

మీటూ ఉద్యమంపై మహేష్‌బాబు హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

ఉద్యమం. దీని గురించి తెలియని వారుండరు. హాలీవుడ్ నుంచి కోలివుడ్ దాకా... సినీ ఇండస్ట్రీని గడగడలాడించిన ఉద్యమం. తెరపై కనిపించే అనేకమంది రంగుల ముఖాల వెనుక ఉన్న అసలు నిజాల్ని బయటకు తీసుకొచ్చిన ఉద్యమం మీటూ. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్లు. ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు పెద్ద ఎత్తున తమకు జరిగిన అన్యాయాన్ని, లైంగిక వేధింపుల్ని మీటూ పేరుతో అందరికి తెలిసేలా చేశారు. హాలీవుడ్‌తో పాటు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని సైతం మీటూ ఉద్యమం షేక్ చేసి పడేసింది. అలాంటి మీటూపై తాజాగా కియరా అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేసింది. 2014లో ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది ఈ భామ. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే.. టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇటు తెలుగులో కూడా టాప్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. తాజాగా కియరా మీటూ ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మీటూ వల్ల అనుకున్నంతగా పూర్తి ఫలితం రాలేదని చెప్పుకొచ్చిందీ ఈ ముద్దుగుమ్మ. మీటూ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని తాను అనుకున్నా కానీ.. అలాంటి మార్పు ఏం రాలేదంది కియరా. ఇక ముందు మార్పు వస్తుందని కూడా తాను అనుకోవడం లేదని చెప్పింది. అకస్మాత్తుగా కియార ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కియార నోట వెంట అలాంటి మాటలు రావడానికి కారణాలేంటి? అన్న కోణంలో ఇప్పుడు బాలీవుడ్ అంతా ఆలోచిస్తోంది. ప్రస్తుతం కియరా బాలీవుడ్‌లోని ‘భూల్ బులయ్య 2’సినిమాలో నటిస్తుంది. ఇందులోకార్తిక్ ఆర్యన్‌తో కలిసి ఆమె యాక్ట్ చేస్తుంది. మరోవైపు తాజాగా కియరా నటించిన గిల్టీ సినిమా కూడా బాలీవుడ్‌లో రిలీజైంది. అయితే ఇంత బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు మీటూపై వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. మీటూ ద్వారా సినీ పరిశ్రమలోని ఎందరివో బాగోతాలు బయటపడ్డాయి. మీటూ వల్ల ఇండస్ట్రీకి ఎంతో మేలు జరిగిందని చాలామంది హీరోయిన్లు కూడా అప్పట్లో మెచ్చుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2vc53qR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...