Tuesday, 24 March 2020

రజినీకాంత్ సూపర్ స్టైల్.. కాపీ కొట్టడానికి మెలికలు తిరిగిపోయాడు!

సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయన స్టైల్‌కి పడిపోనివారు అంటూ ఉండరు. ఆయన టవల్ తీసినా, నోటిలో బబుల్ గమ్ వేసుకున్నా, చుట్టను విసిరి నోటితో పట్టుకున్నా, కళ్లకు అద్దాలు పెట్టకున్నా.. ప్రతి దానిలో రజినీకా మార్క్ స్టైల్ ఉంటుంది. అయితే, రజినీకాంత్ స్టైల్‌ను కాపీ కొట్టాలని చూశారు ప్రముఖ టీవీ ప్రెజెంటర్ బేర్ గ్రిల్స్. రజినీకాంత్ స్టైల్‌గా కళ్లద్దాలు పెట్టుకుంటారు కదా.. బేర్ గ్రిల్స్ కూడా అలానే పెట్టుకోవాలని ట్రై చేశారు. రజినీకాంత్ స్వయంగా చేసి చూపించారు. కానీ, బేర్ గ్రిల్స్ వల్ల కాలేదు. అచ్చం రజినీలా చేయడానికి ఆయన తెగ మెలికలు తిరిగిపోయారు. బ్రిటిష్ సర్వైవలిస్ట్, టీవీ ప్రెజెంటర్ అయిన బేర్ గ్రిల్స్‌తో కలిసి అడవిలో రజినీకాంత్ ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. డిస్కవరీలో ప్రసారమయ్యే ‘ఇంటూ ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ అండ్ రజినీకాంత్’ కార్యక్రమం కోసం వీరిద్దరూ జతకట్టారు. కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో షూట్ చేసిన ఈ కార్యక్రమంలో బేర్ గ్రిల్స్‌తో కలిసి రజినీకాంత్ ఎన్నో సాహసాలు చేశారు. 69 ఏళ్ల వయసులోనూ తాళ్ల సాయంతో కొండలు ఎక్కారు. నడుంలోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లారు. లోయలో ఇనుప వంతెనపై ప్రమాదకర స్థితిలో నడిచారు. Also Read: ఈ కార్యక్రమం డిస్కవరీ ఛానెల్‌లో మార్చి 23న రాత్రి 8 గంటలకు ప్రసారమైంది. అయితే, ఈ కార్యక్రమంలో రజినీకాంత్ చేసిన సాహసాల కన్నా.. ఆయన స్టైల్‌ను బేర్ గ్రిల్స్ అనుసరించడానికి ప్రయత్నించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రజినీకాంత్‌లా స్టైల్‌గా కళ్లద్దాలు పెట్టుకునేందుకు బేర్ ప్రయత్నించి విఫలమయ్యారు. వెంటనే రజినీ అలా కాదంటూ ఎలా పెట్టుకోవాలో చేసి చూపించారు. ‘‘అందుకే మీరు మూవీ స్టార్ అయ్యారు’’ అంటూ బేర్ గ్రిల్స్ కితాబిచ్చారు. ఆ తరవాత తన స్టైల్‌ను బేర్ గ్రిల్స్‌కు కూడా నేర్చించారు. ఆ వీడియోను మీరు కింది ట్వీట్‌లో చూడొచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WE34Xv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...