Friday, 20 March 2020

బాబోయ్.. హీట్ పెంచేస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్

ఒకప్పుడు హీరోయిన్లు సినిమాలకు దూరమైతే ఆ తరవాత వాళ్లు కనిపించేది చాలా అరుదు. ఎప్పుడైనా ఏవైనా వేడుకల్లోనో, వాళ్లకు పెళ్లయినప్పుడే చూడటమే. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. సోషల్ మీడియా యుగం వచ్చింది. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకుని రకరకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ముందుగా ఫాలోవర్లను పెంచుకోవడం కోసం అందాలను తెగ ఆరబోస్తున్నారు. అందరు హీరోయిన్లు అలా ఉన్నారని కాదు.. ముఖ్యంగా ఉత్తరాది నటీమణుల్లో చాలా మంది ఇలానే చేస్తున్నారు. వీరిలో పాయల్ ఘోష్ ఒకరు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రయాణం’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన బెంగాల్ బ్యూటీ పాయల్ ఘోష్. ఆ సినిమాలో మంచు మనోజ్ సరసన పాయల్ నటించింది. ఆ తరవాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఊసరవెల్లి’ సినిమాలో ఒక హీయిన్‌గా నటించింది. ‘మిస్టర్ రాస్కెల్’ అనే చిన్న సినిమాలో నటించిన తరవాత మళ్లీ ఈ బ్యూటీ టాలీవుడ్‌లో కనిపించలేదు. ‘పటేల్ కి పంజాబీ షాది’ అనే సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది పాయల్. ఈ సినిమా వచ్చి మూడేళ్లు గడిచిపోయింది. కానీ, ఈ భామకు అవకాశాలు రావడంలేదు. Also Read: దీంతో సినిమాలను నమ్ముకుంటే లాభం లేదని మోడలింగ్‌లో సత్తా చాటుతోంది. మ్యాగజైన్ల కోసం ఫొటోషూట్లు చేస్తోంది. హాట్ హాట్ ఫొటోషూట్లు చేస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతోంది. అందాలను ఆరబోస్తూ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఇలాంటి ఫొటోలు కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు చాలా హాట్‌గా ఉన్నాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పాయల్ ఘోష్‌కు 1.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇలాంటి ఫొటోలు పెడుతుంటే 2 మిలియన్ ఫాలోవర్లను అందుకోవడం పాయల్‌కు పెద్ద కష్టం కాదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xWnp02
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...