Saturday, 7 March 2020

భర్త కొడితే విడాకులా, తిరిగి రెండు పీకలేరా: దర్శకుడి సూటి ప్రశ్న

ప్రముఖ నటి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘థప్పడ్’. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల రిలీజై మంచి టాక్ అందుకుంది. డొమెస్టిక్ వైలెన్స్ నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా ఇది. ఇందులో తాప్సి గృహిణి పాత్రలో నటించారు. తన భర్త, ఇల్లే సర్వస్వం అనుకుని బతికే మహిళ. కానీ తన భర్త వర్క్ టెన్షన్‌లో పడి ఆవేశంలో భార్య చెంపపై కొడతాడు. దాంతో ఆమె విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కుతుంది. కేవలం ఒకే ఒక్క చెంప దెబ్బ వల్ల విడాకులు తీసుకోవాలని అనుకుంటున్న తాప్సి నిర్ణయానికి న్యాయస్థానం కూడా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే కథ. అయితే ఈ సినిమాపై అహ్మద్ ఖాన్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసారు. అసలు సినిమా కాన్సె్ప్ట్ ఏంటో కూడా అర్థంకాలేదని అన్నారు. ‘అసలు నాకు ‘థప్పడ్’ కాన్సెప్ట్ అర్థంకాలేదు. విచిత్రంగా ఉంది. భర్త ఒక్క చెంపదెబ్బ కొట్టగానే భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోతుందా? భర్తతో సమస్య ఉన్నప్పుడు ఆమె కూడా తిరిగి రెండు పీకొచ్చు కదా. ఒకవేళ నేను నా భార్యను కొడితే ఆమె నన్ను కూడా కొట్టి గొడవను అక్కడితో ఆపొచ్చు. ఒకవేళ నాకు నీతో ఉండాలని లేదు అని నేను నా భార్యకు చెప్తే ఆమె కూడా అదే నాకు చెప్పొచ్చు. కానీ ఒక్క చెంప దెబ్బ భార్యాభర్త కలిసి ఉండాలా లేదా అన్నది నిర్ణయించలేదు కదా. అయితే ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయనుకోండి’ అని తెలిపారు. READ ALSO: ఇదే విషయాన్ని తాప్సిని అడగ్గా... ‘అహ్మద్ ఖాన్ గారు తనకు నచ్చిన పద్ధతి, తనకు సరైంది అనిపించే పద్ధతిలో సినిమాలు తీస్తారు. మనం ఎలాంటి సినిమాలు తీసినా చివరకు బాగుందా లేదా అని చెప్పాల్సింది ప్రేక్షకులే. మనం ఇప్పటివరకు ప్రేమ, గౌరవంతో నిండిన బంధాలే చూసారు. బహుశా అహ్మద్ ఖాన్ కొట్టుకుంటూ సర్దుకుపోయే బంధాలను చూసి ఉంటారు’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cFVjpt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...