Saturday, 7 March 2020

‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’: ప్రదీప్ సినిమా వెనక టాప్ బ్యానర్లు

బుల్లితెర రారాజు ప్రదీప్ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకన్నా’ పాటను 4 కోట్ల మందికి పైగా విన్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ సాంగ్‌ను రిలీజ్ చేయడంతో విపరీతమైన హైప్ వచ్చేసింది. అయితే ఈ సినిమాను ఇప్పుడు టాలీవుడ్‌కు చెందిన రెండు టాప్ నిర్మాణ సంస్థలు సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చాయి. అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్, ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాయి. ఇందులో అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు. మార్చి 25న సినిమా రిలీజ్ అవబోతోంది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పుడే రానా దగ్గుబాటి నుంచి సపోర్ట్ లభించింది. ఆయనే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ కన్నడ నిర్మాత ఎస్వీ బాబు సినిమాను నిర్మించారు. మున్నా దర్శకత్వం వహించారు. ప్రదీప్‌కు ఉన్న క్రేజ్‌తో సినిమాకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం రాలేదు. READ ALSO: గతవారం జబర్దస్త్ షోకు గెస్ట్‌గా వెళ్లిన ప్రదీప్ సుడిగాలి సుధీర్ టీంతో కలిసి స్కిట్ చేసారు. అక్కడ కూడా తన సినిమాను బాగా ప్రమోట్ చేసుకున్నాడు. ఈ సినిమాలోని 'నీలి నీలి ఆకాశం' ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత "ఇదేరా స్నేహం.. కనివిని ఎరుగని స్నేహం, ఇది కాలం చూడని స్నేహం.. దేహం అడగని స్నేహం..'అంటూ సాగే ఈ లిరికల్‌ సాంగ్‌ యూత్‌ను ఆకట్టుకుంటుంది. ఈ పాటను అలవైకుంఠపురంలో 'బుట్టబొమ్మ' ఫేమ్‌ అర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు. చంద్రబోస్‌ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ttvq4W
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...