Tuesday, 3 March 2020

రాధిక నా తల్లి కాదు.. వాళ్లు మొరిగే కుక్కలు: వరలక్ష్మీ శరత్‌కుమార్

నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఫైర్ బ్రాండ్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆమె మాటలు ముక్కుసూటిగా ఉంటాయి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంటారామే. అస్సలు సంకోచించరు. అందుకే ఆమెను విమర్శించేవారు కూడా ఎక్కువగా ఉంటారు. అలాంటి వాళ్లకు వరు ఇచ్చే సమాధానం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. వరలక్ష్మి తాజాగా ‘వెల్వెట్ నగరం’ అనే తమిళ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రచారంలో భాగంగా ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కు దర్శకుడు మనోజ్‌కుమార్ నటరాజన్‌తో కలిసి వరలక్ష్మి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో వరలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన తండ్రి శరత్‌కుమార్ రెండో భార్య రాధికను ఉద్దేశించి మాట్లాడారు. రాధిక కుమార్తె (మొదటి భర్త సంతానం) రేయాన్ మిథున్ ప్రస్తావన ఇంటర్వ్యూలో వచ్చింది. శరత్‌కుమార్‌తో రాధిక రిలేషన్‌షిప్‌పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడే వ్యక్తులపై రేయాన్ ఆ మధ్య విరుచుకుపడ్డారు. ట్విట్టర్ ద్వారా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మాట్లాడాలని ఇంటర్వ్యూలో వరలక్ష్మిని అడిగారు. Also Read: ‘‘రే చాలా ధైర్యవంతురాలు. తన సమస్యలను తాను పరిష్కరించుకోగల సామర్థ్యం ఉన్న అమ్మాయి. బయట జనాలు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. రాధిక నా తల్లి అని అంటారు. ఆమె నా తల్లి కాదు. నా తండ్రికి రెండో భార్య. ఈ విషయంలో మేమంతా సంతోషంగానే ఉన్నాం. కానీ, బయట బోలెడన్ని పుకార్లు. రాధికకు నాకు పడదని అంటుంటారు. మా ఇద్దరి మధ్య మంచి రాపో ఉంది. ‘నువ్వు ఆమెను ఆంటీ అని పిలుస్తావేంటి’ అని ఎవరో ట్వీట్ చేశారు. నేను ఆంటీ అనే పిలుస్తాను. రాధిక నాకు అమ్మ కాదు. ఎవరికైనా ఒక్క అమ్మే ఉంటారు. కాబట్టి, రాధిక నాకు ఆంటీ మాత్రమే. నా తండ్రి, రాధిక ఇద్దరినీ నేను సమానంగా గౌరవిస్తాను. వాళ్లకు వ్యతిరేకంగా ఏమీ చేయను. రే కూడా అంతే. ఆమెకు వేరే తండ్రి ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆమె తల్లి మా నాన్నను పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆమెకు కూడా తండ్రయ్యారు. ఆమె పెళ్లి కూడా నాన్నే చేశారు. దీనిలో ఏం తప్పుంది. కొంత మంది మాటలు పట్టించుకోకూడదు. వాళ్లంతా మొరిగే కుక్కలు’’ అని ఘాటుగానే మాట్లాడారు వరలక్ష్మి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cutbpc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...