Tuesday, 3 March 2020

షాకిస్తున్న ప్రభాస్ రెమ్యునరేషన్.. హిట్, ఫ్లాప్‌తో సంబంధంలేదు సుమీ!

ప్రస్తుతం టాలీవుడ్‌లో హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ‘బాహుబలి’ సినిమా తర్వాత ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు. ఇక నుంచి ఆయన చేసే సినిమాలే కాదు ఆయన తీసుకునే పారితోషికం కూడా అంతే రేంజ్‌లో ఉంటుంది. కాగా, ఇటీవల ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రభాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 50 ఏళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న వైజయంతి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఇదో సైన్స్ ఫిక్షన్ స్టోరీ అని, ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరవేసేలా సినిమాను తీస్తానని అశ్విన్ తెలిపారు. మరి ఆ రేంజ్‌లో సినిమా ఉండబోతోందంటే.. ప్రభాస్‌కు గట్టిగానే రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారు. విశ్వసనీయ వర్గాల సమాచారం సినిమాకు ప్రభాస్ ఏకంగా 70 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నారట. సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్న విషయంలో ప్రభాస్‌కు సంబంధం లేదు. సినిమా అవుట్‌పుట్ ఎలా ఉన్నా ప్రభాస్‌కు రావాల్సిన 70 కోట్లు ఇవ్వాల్సిందేనట. ప్రభాస్‌కు ప్రాఫిట్స్‌లో వాటా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాలు మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాయనుకోండి. ఒకవేళ ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటే మాత్రం ప్రభాస్‌కు ఇక ఆకాశమే హద్దు అని చెప్పాలి. READ ALSO: మరో పది నెలల తర్వాత సినిమా షూటింగ్ మొదలవుతుందని అశ్విన్ తెలిపారు. సినిమాను తెలుగు, హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు కాబట్టి బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణెను హీరోయిన్‌గా ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారట. ఎందుకంటే దీపిక హిందీలోనే కాదు తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. అందుకే ఆమె అయితే కాస్త ఫ్రెష్ పెయిర్‌ను చూసినట్లు ఉంటుంది, సినిమాకు గ్రాండ్ లుక్‌ కూడా ఉంటుంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TjO1jV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...