Friday, 6 March 2020

చీఫ్ గెస్ట్‌గా అర్హ.. హిలేరియస్ కామెంట్ చేసిన బన్నీ

సినీ సెలబ్రిటీల పిల్లలు చేసే సందడి అంతా ఇంతా కాదు. అందులోనూ మన టాలీవుడ్ స్టార్ కిడ్స్‌ని చూడటానికి రెండు కళ్లు చాలవు. స్టైలిష్ స్టార్ పిల్లలు అయాన్, అర్హల అల్లరైతే ఇక చెప్పనక్కర్లేదు. నిన్న గీతా ఆర్ట్స్ సంస్థలో యువ హీరో నిఖిల్ నటిస్తున్న ‘18 పేజెస్’ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ పూజా కార్యక్రమానికి నిర్మాత అల్లు అరవింద్ తన మనవరాలు అర్హతో కలిసి వచ్చారు. అక్కడ అర్హ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. తన సినిమా షూటింగ్ లాంచ్ ఈవెంట్‌కు అర్హ చీఫ్ గెస్ట్ అంటూ నిఖిల్ క్యూట్ వీడియో పోస్ట్ చేసారు. దీనిపై బన్నీ స్పందిస్తూ తనదైన శైలిలో హిలేరియస్ కామెంట్ పెట్టారు. ‘కొత్త మూవీ స్టార్ట్ అయిన సందర్భంగా నిఖిల్‌కి ఆల్ ది బెస్ట్. అర్హ చాలా లక్కీ. ఇప్పుడే చీఫ్ గెస్ట్‌ అయిపోయింది. కానీ నాకైతే 23 ఏళ్లు పట్టింది’ అని క్యాప్షన్ ఇచ్చారు. అన్నట్టు.. ఈరోజు బన్నీ, స్నేహ దంపతుల తొమ్మిదో పెళ్లి రోజు. ఏటా తన పెళ్లి రోజున బన్నీ అపురూపమైన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈసారి కూడా తన పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ.. ‘తొమ్మిదేళ్ల దాంపత్య జీవితం. సమయం చాలా వేగంగా గడిచిపోతోంది. కానీ ప్రేమ మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోంది’ అని స్వీట్ కామెంట్ చేసారు. ఈ ఫొటోకు ఇప్పటివరకు ఏడు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. చూడముచ్చటైన జంట అంటూ చాలా మంది ఫ్యాన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. READ ALSO: ‘అల వైకుంఠపురములో’ సినిమాతో రెండేళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ విజయం అందుకన్న బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇందులో హీరోయిన్ ఎవరన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో బన్నీ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఇటీవల కొత్త లుక్‌తో బన్నీ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cyIT2N
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...