Friday, 6 March 2020

అహం బ్రహ్మాస్మీ షురూ.. చరణ్, మనోజ్ ఎంట్రీ కేక

మంచు వారసుడు మనోజ్ నుంచి సినిమా నుంచి చాలా కాలం అవుతోంది. వరుసగా ఫ్లాప్స్ రావడంతో మంచి కథ కోసం ఎదురుచూస్తూ ఇన్నాళ్లూ ఏ సినిమాకు ఓకే చేయలేదు. ఇప్పుడు ఎంఎం ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి ఈ బ్యానర్‌లో మొదటి సినిమాగా ‘అహ్మం బ్రహ్మాస్మి’ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. బుధవారం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. మూడు రకాల హావభావాలతో పోస్టర్‌లో మంచు మనోజ్ లుక్ అదిరిపోయింది. ఇకపోతే ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. చరణ్, మనోజ్ కలిసి ఇచ్చిన ఎంట్రీకి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. రాకతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఇందులో ప్రియా భవానీ శంకర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు మనోజ్ ప్రకటించారు. ఈయన పాత్ర గురించి ఏళ్ల తరబడి చర్చించుకున్నారని మనోజ్ ధీమా వ్యక్తం చేసారు. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా ఫిలింగా తెరకెక్కిస్తున్నారు. READ ALSO: ఇప్పటివరకు తాను ఇండస్ట్రీలో లేని లోటును ఈ సినిమా తీర్చబోతోందని మనోజ్ తెలిపారు. క్రైం, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు ఒళ్లు గగుర్పొడిచే సినిమాను అందించబోతున్నట్లు వెల్లడించారు. ‘‘కొత్త సినిమా, కొత్త ఆశలు. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడంలో ఉన్న ఎవర్‌గ్రీన్ హ్యపీనెస్‌తో.. నా స్నేహితులు, కుటుంబీకులు, అభిమానులు ముఖ్యంగా నా డియర్ బ్రదర్ రామ్ చరణ్‌కు ధన్యవాదాలు. నాకు మరింత ప్రేమ, పవర్‌ను పంచారు. ఈరోజు నుంచి అహం బ్రహ్మాస్మీ ప్రారంభం కానుంది. మీ ఆశీర్వాదాలు, ప్రేమాభిమానాలు కావాలి’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aIE2un
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...