Wednesday, 4 March 2020

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్: ఆ బ్లాక్ బస్టర్ సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మెగా పవర్‌స్టార్ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగిపోయాడు రామ్ చరణ్. తండ్రి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో తన పేరును నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు తండ్రితోనే సినిమాలు తీసే స్థాయికి చేరుకున్నారు. మార్చి 27న బర్త్‌డే. అందుకే ఆయన ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు. చరణ్ ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అందుకే ఆ సినిమానే చెర్రీ బర్త్‌డే రోజున మళ్లీ రిలీజ్ చేయనున్నారు. వైజాగ్‌లోని శ్రీకాంతి థియేటర్లో సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా షోను వేయనున్నారట. అయితే ఇది కేవలం వైజాగ్‌లోని చెర్రీ అభిమానుల కోసం మాత్రమే. మరి మిగతా ప్రాంతాలకు చెందిన చరణ్ అభిమానులు ఏం సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారో వేచి చూడాలి. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘చిరుత’ సినిమాలో నేహా శర్మ హీరోయిన్‌గా నటించారు. ప్రకాశ్ రాజ్ విలన్ పాత్రను పోషించారు. పూరీ టేకింగ్, చెర్రీ యాక్టింగ్, మ్యూజిక్.. ఇలా అన్నీ కుదరడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అయిపోయింది. ఆ తర్వాత చెర్రీ కెరీర్ తండ్రిలాగే దూసుకెళ్లిపోయింది. READ ALSO: ఆ తర్వాత చెర్రీకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అసవరం రాలేదు. చిరు కుమారుడు అయినంతమాత్రాన ఆయన అవకాశాలు వచ్చేయలేదు. ప్రతీ సినిమాతో చెర్రీ తన నటనను మెరుగుపరుచుకుంటూ ఈ స్థాయికి ఎదిగారు. తన కష్టంతో సంపాదించుకున్న డబ్బుతో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా తన తండ్రితోనే సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చెర్రీ ‘RRR’ సినిమాతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TF0nSz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...