Wednesday, 18 March 2020

బాత్ టబ్‌లో బిగ్ బాస్ బ్యూటీ, విజయ్ దేవరకొండ.. సేమ్ టు సేమ్

సినీ తారలు చేసే కొన్ని ఫొటోషూట్లు చాలా విడ్డూరంగా, విచిత్రంగా ఉంటాయి. తమ ప్రత్యేకతను చాటుకోవడానికి ఇలాంటి ఫొటోషూట్లు చేసినా చూసేవాళ్లకు మాత్రం చాలా వెటకారంగా అనిపిస్తుంది. వాటిపై జోకులు, సెటైర్లు వేయాలనిపిస్తుంది. అయినప్పటికీ సెలబ్రిటీలు ఎక్కడా తగ్గరు. ఎందుకుంటే వాళ్లకు కావాల్సిందే ఆ అటెన్షన్. అందరూ ఆ ఫొటోలను చూడాలి.. కామెంట్లు చేయాలి. ఈ విషయంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే, ఆయన స్టైలింగ్, డ్రెస్సింగ్ చాలా విచిత్రంగా ఉంటాయి. టాలీవుడ్‌లో ఉన్న హీరోలందరికన్నా విజయ్ దేవరకొండ స్టైలింగ్ ప్రత్యేకంగా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే, ఫొటోషూట్ విషయంలోనూ విజయ్ దేవరకొండ తన ప్రత్యేకతను చాటుకున్నారు. నీట్‌గా షూట్ వేసుకుని బాత్ టబ్‌లో పడుకుని ఫొటో తీసుకున్నారు. ఫొటోషూట్లలో ఇదోరకం. ఈ ఫొటోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు విపరీతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే 7.5 లక్షల మంది ఈ ఫొటోను లైక్ చేశారు. వీరిలో బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ కూడా ఉండటం విశేషం. అయితే, విజయ్ దేవరకొండ కన్నా ముందే నందిని రాయ్ ఇలాంటి ఫొటోషూట్ చేసింది. బాత్‌ టబ్‌లో పడుకొని ఫొటోకు పోజిచ్చింది. అచ్చం ఆమెలానే ఇప్పుడు విజయ్ చేశారు. కాకపోతే, విజయ్ బాత్ టబ్‌లో నీళ్లు పోసుకుని అందులో పడుకున్నారు. ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ముంబైలో 40 రోజులపాటు షూటింగ్ చేసి ఇటీవలే చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌కు వచ్చింది. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు నిర్మాతలు పూరి జగన్నాథ్, ఛార్మి ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను బాలీవుడ్‌లో విడుదల చేయడం కోసం ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌తో పూరి జగన్నాథ్ చేతులు కలిపారు. మరోవైపు ‘బిగ్ బాస్’ షోలో పాల్గొనడం ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గర్తింపు తెచ్చుకుంది నందిని రాయ్. అప్పటికే ఈమె హీరోయిన్‌గా చేసినప్పటికీ పెద్దగా ఎవరికీ తెలీదు. అయితే, ఈ షోలో పాల్గొనడంతో ఒక్కసారిగా పాపులారిటీ వచ్చింది. కానీ, ఆ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా నందినికి సినిమా అవకాశాలు పెరగలేదు. దీంతో మోడల్‌గా రాణిస్తోంద. హాట్ హాట్ ఫొటోషూట్లు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు నయనానందాన్ని కలిగిస్తోంది. దీనిలో భాగంగా రెండు రోజుల క్రితం బాత్ టబ్‌లో పడుకొని తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ugas8F
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...