Wednesday, 18 March 2020

కరోనాపై పోరాటం: సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ విసురుతోన్న స్టార్స్

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది. వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ కరోనా వైరస్ నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోవాలని, దీని కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ () సూచిస్తోంది. దీనిలో భాగంగా సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. చేతులను శుభ్రంగా కడుక్కోవడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. అయితే, ఈ ఛాలెంజ్ ప్రజల్లోకి వెళ్లడానికి ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలను దీనిలో భాగం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రాస్ అధనామ్ గెబ్రెయేసూస్ మొట్టమొదటిగా ఈ సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ను చేసి చూపించారు. కోవిడ్ 19 నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మొదటిగా చేయాల్సిన పని రెండు చేతులను శుభ్రపరుచుకోవడమని సూచించారు. అందుకనే ఈ సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ను ప్రారంభించామని చెప్పారు. చేతులను సబ్బుతో ఎలా శుభ్రపరుచుకోవాలో స్పష్టంగా వీడియో ద్వారా చూపించారు. ఈ వీడియోను WHO ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఆ తరవాత ఈ ఛాలెంజ్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలకు ఆయన విసిరారు. చేతులు కడుక్కుంటున్న వీడియోను షేర్ చేయాలని కోరారు. ఇండియాలో దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రాకు ఆయన ట్విట్టర్ ద్వారా సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ను విసిరారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన దీపికా పదుకొనే.. తాను కూడా చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో వీడియో రూపంలో చూపించారు. దీన్ని ట్వీట్ చేశారు. ఈ సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌కు తనను నామినేట్ చేసినందుకు డాక్టర్ టెడ్రాస్‌కు థ్యాంక్స్ చెప్పారు. కోవిడ్ 19 అనేది కచ్చితంగా ఆరోగ్యానికి హానికరమని, ఇదొక పబ్లిక్ సేఫ్టీ టాస్క్ అని అన్నారు. అందరూ కలిసి దీనిపై పోరాడాలన్నారు. ఈ ఛాలెంజ్‌‌కు రోజర్ ఫెదరర్, క్రిస్టియానో రొనాల్డో, విరాట్ కోహ్లీను దీపికా నామినేట్ చేశారు. దీపికా పదుకొనే తరువాత మరో బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ కూడా సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ను చేసి చూపించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వీడియో పెట్టారు. ఇక, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఈ సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ను స్వీకరించారు. చేతులను ఎలా శుభ్రపరుచుకోవాలో చూపించారు. అలాగే, రష్యన్ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా, ఇండియన్ ఉమెన్ హాకీ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్ కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ను స్వీకరించి చేతులు ఎలా శుభ్రపరుచుకోవాలో వీడియో రూపంలో చూపించారు. మొత్తం మీద WHO చేపట్టిన ఈ సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2x5Sj5A
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...