Wednesday, 4 March 2020

‘ఒరేయ్‌ బుజ్జిగా’ టీజ‌ర్: నాన్నను మందుందా అని అడిగేస్తున్న హీరోయిన్

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా వస్తోన్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా...’. హెబ్బా పటేల్ కీలక పాత్ర పోషించారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మించారు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. అనూప్‌ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. ఇటీవ‌ల విడుద‌లైన ‘కురిసెన.. కురిసెన..’ పాట‌కి మంచి స్పందన వ‌స్తోంది. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు హ‌రీష్ శంక‌ర్ బుధవారం సాయంత్రం ఈ టీజర్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ‘‘అమ్మాయిలు బాగా ముదుర్లబ్బా.. రిక్వెస్ట్ పెట్టగానే చూస్తారు.. యాక్సెప్ట్ చేయడానికి మాత్రం రెండు రోజులు చేతులు పిసుక్కుంటారు’’ అని రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభ‌మ‌య్యే ఈ టీజ‌ర్ ఆద్యంతం హిలేరియ‌స్‌గా ఆక‌ట్టుకుంది. ‘‘అసలు బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటి? ఒక ఫ్లిఫ్‌ కార్ట్, ఒక స్విగ్గీ, ఒక ఓలా, ఒక బుక్ మై షో, ఒక క్రెడిట్ కార్డ్’’ అని అమ్మాయి చెప్పే డైలాగ్ యూత్‌కు కనెక్ట్ అవుతుంది. Also Read: అలాగే, ‘‘మందుందా?’’ అని హీరోయిన్ అడిగిన ప్రశ్నకి ‘‘నా దగ్గర పెద్దగా బ్రాండ్స్ లేవ‌మ్మా..’’ అని న‌రేష్ చెప్పే డైలాగ్‌.. దానికి స‌మాధానంగా ‘‘బాధకి బ్రాండ్స్‌తో పనేంటి డాడీ’’ అని చెప్పే డైలాగ్ మ‌రింత ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా సాగిన ఈ టీజర్‌లో కామెడీ, రొమాన్స్‌తో పాటు డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక రాజ్ తరుణ్ కూడా ఫుల్ హుషారుగా కనిపించారు. మొత్తంగా ఒక నిమిషం ఇర‌వై సెకండ్ల నిడివి గ‌ల ఈ టీజర్ సినిమాపై అంచనాలని పెంచుతోంది. ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుద‌ల‌కాబోతుంది. కాగా, ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. నంద్యాల రవి మాటలు రాసిన ఈ సినిమాకు ఐ.ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. శేఖర్ మాస్టర్ అన్ని పాటలకు కొరియోగ్రఫీ చేశారు. రిలయ్ సతీష్ ఫైట్స్ కంపోజ్ చేశారు. వేణు కూరపాటి కో-డైరెక్టర్‌గా వ్యవహరించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కొండా విజయ్‌కుమార్‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39pdcH5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...