Thursday, 19 March 2020

మరో సావిత్రిని అయ్యేదాన్ని: సిద్ధార్థ్‌పై సమంత సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌లోని అందమైన జంటల్లో అక్కినేని నాగచైతన్య, సమంత జోడి ఒకటి. 2017 అక్టోబర్‌లో ప్రారంభమైన వీరి దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరిగా బ్రహ్మాండంగా సాగుతోంది. వీరిది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. సుమారు ఏడేళ్లపాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి గోవాలో గ్రాండ్‌గా పెళ్లిచేసుకున్నారు. అప్పట్లో వీరి పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అయితే, నాగచైతన్య కన్నా ముందు హీరో సిద్ధార్థ్‌తో సమంత ప్రేమలో పడినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయనతో సమంత డేటింగ్ కూడా చేసినట్టు సమాచారం. కానీ, వీరి రిలేషన్‌షిప్‌ ఎంతో కాలం నిలవలేదు. సిద్ధార్థ్‌కు బ్రేకప్ చెప్పిన తరవాత సమంతకు నాగచైతన్య పరిచయం అయ్యారు. ఇద్దరూ ప్రేమలో పడి పెళ్లిచేసుకున్నారు. అయితే, సిద్ధార్థ్‌తో ప్రేమ వ్యవహారం గురించి తాజాగా సమంత స్పందించారు. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమన్ 2019గా నిలిచిన సందర్భంగా సమంతను ఓ ఎంటర్‌టైన్మెంట్ పోర్టల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ బోయ్‌ఫ్రెండ్ సిద్ధార్థ్ గురించి మాట్లాడుతూ సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధార్థ్‌తో విడిపోవడం ఎంతో మంచిదైందని అన్నారు. అతనితో సంబంధాన్ని కొనసాగించి ఉంటే తన జీవితం మరో సావిత్రి జీవితంలా అయిపోదేని వ్యాఖ్యానించారు. Also Read: ‘‘సావిత్రి మాదిరిగానే నేను కూడా నా వ్యక్తిగత జీవితంలో ఒక సంక్షోభంలో కూరుకుపోయుండేదాన్ని. కానీ, దేవుడి దయవల్ల మొదట్లోనే వాస్తవాలు ఏంటో గ్రహించాను. వెంటనే ఆ సంబంధం నుంచి బయటపడ్డాను. ఆ తరవాత నా జీవితంలోకి నాగచైతన్య వంటి మంచి వ్యక్తి వచ్చారు. ఆయన ఒక ఆణిముత్యం’’ అని సమంత చెప్పుకొచ్చారు. మరి దీనిపై సిద్ధార్థ్ ఎలా స్పందిస్తారో చూడాలి. Also Read: ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ‘జాను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘96’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సమంత చేతిలో తెలుగు సినిమాలు ఏమీ లేవు. ఒక తమిళ సినిమాలో నటిస్తు్న్నారు. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతోన్న ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో సమంత ఒక హీరోయిన్. నయనతార మరో హీరోయిన్. ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2vBI0G8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...