Wednesday, 4 March 2020

Balakrishna: బాలయ్యకు జోడీగా మిల్కీ బ్యూటీ .. కాజల్‌ను కూడా అడిగారట

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో ఇంకా టీం నుంచి క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే అంజలిని ఎంపిక చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె బాలయ్య హీరోయిన్‌గా నటించడం లేదని, వేరే క్యారెక్టర్ చేస్తోందని కొందరి వాదన. అయితే బాలయ్య, బోయపాటి సినిమాలో అసలు హీరోయిన్ ఎవరు అన్నదానిపై ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటికి వచ్చింది. సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, కాజల్ అగర్వాల్‌లో ఎవరో ఒకర్ని ఎంపిక చేసుకోవాలని బోయపాటి ప్లాన్ వేసారట. సినిమా గురించి ఇద్దరినీ సంప్రదించి ఎవరు ఓకే చేస్తే వారిని తీసుకోవాలని అనుకున్నారట. అయితే కాజల్ అగర్వాల్ మాత్రం ఇంకా తన రిప్లై చెప్పలేదు కానీ, తమన్నా ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే భారీ రెమ్యునరేషన్ ఇస్తేనే ఓకే చేస్తాను అని చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఎందుకంటే బాలయ్య పక్కన తమన్నా, కాజల్‌లాంటి హీరోయిన్లు నటించడం అనేది మామూలు విషయం కాదు. వాళ్లు ఒప్పుకున్నారు అంటే నిర్మాత భారీగా చెల్లించారనే అనుకోవాలి. అయితే తక్కువ బడ్జె్ట్‌తోనే సినిమాను తీయాలని బోయపాటి, బాలయ్య అనుకున్నారట. READ ALSO: ఇలాంటి టైంలో తమన్నా భారీగా పారితోషికం డిమాండ్ చేయడంపై బోయపాటి అప్‌సెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ రూమర్స్‌తో ఎంత నిజం ఉందో తెలీదు కానీ బాలయ్య సినిమాలో తమన్నా నటిస్తే మాత్రం సినిమాకు మంచి కలర్ ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎప్పుడూ సినిమా రాలేదు కాబట్టి ఫ్యాన్స్ కూడా చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య అఘోరా గెటప్‌లో కనిపిస్తారట. అందుకే సినిమాను వారణాశిలోనే ఎక్కువగా చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి బాలయ్య కోసం బోయపాటి గట్టి కథనే రాసుకున్నట్లు తెలుస్తోంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39tXPxe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...