Tuesday, 3 March 2020

ఒక్క ప్రకటన, రోజుకి 7 కోట్ల రెమ్యునరేషన్.. చైనా వాళ్లతో రిస్కెందుకు భాయ్?

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మా్న్ ఖాన్ పేరుతో దేన్ని ప్రమోట్ చేసినా చాలు అది వైరల్ అయిపోతుంది. సల్లూ భాయ్ ప్రమోట్ చేస్తున్నారంటే అందులో ఏదో ఉండే ఉంటుంది అన్న ఆసక్తి జనాల్లో కలుగుతుంది. అందుకే సల్మాన్ చేత యాడ్స్ చేయించుకోవడానికి పెద్ద పెద్ద బ్రాండ్లు ఎగబడుతుంటాయి. ఓ చైనీస్ స్మార్ట్ఫోన్‌ బ్రాండ్‌కి సల్మాన్ ఇటీవల బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు కాంట్రాక్ట్‌పై సంతకం చేసారు. అయితే ఇందుకోసం సల్మాన్ ఓ ప్రకటనలో నటించాల్సి ఉంది. ఈ యాడ్ షూట్ చేయడానికి కనీసం ఓ వారం రోజులైనా పడుతుంది. ఎందుకంటే సల్లూ భాయ్ కాల్‌షీట్స్ దొరకడం అంత సులువు కాదు. ఇకపోతే ఈ ప్రకటనలో నటించేందుకు సల్మాన్ రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా? రోజుకి అక్షరాలా ఏడు కోట్ల రూపాయలు. ఇప్పటివరకు ఇండియాకు చెందిన ఏ స్టార్ హీరో కూడా ఇంత స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోలేదట. దాంతో ఈ టాపిక్‌ కాస్తా బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో ముంబయిలోని మెహబూబ్ స్టూడియోస్‌లో ఈ యాడ్ షూట్ జరుగుతుంది. సల్మాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏం చేసినా ఇండియాలో ఉన్న ఫ్యాన్సే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారికి కూడా తెలుస్తుంది. READ ALSO: అందుకే సల్మాన్ అడిగినంత ఇవ్వడానికి ఆ చైనీస్ కంపెనీ కూడా ఏమాత్రం వెనకడుగు వేయలేదట. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘రాధే యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రభుదేవా సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దిశా పటానీ కథానాయికగా నటిస్తున్నారు. రణ్‌దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రంజాన్‌కు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cqAtKJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...