Wednesday, 26 February 2020

Vijayashanthi: ‘రాహు’ సినిమాపై రాములమ్మ కామెంట్

కృతి గార్గ్, అభిరామ్ వర్మ కాంబినేషన్ లో సుబ్బు వేదుల అందిస్తున్న సినిమా రాహు. ఓ డిఫరెంట్ పాయింట్‌తో తెరకెక్కించిన థ్రిల్లర్ ఇది. ఈ నెల 28న విడుదల కాబోతోంది. ఈ సినిమాపై లేడీ అమితాబ్ స్పందించారు. సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘‘హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యతను ఇస్తూ, కొత్త తరహా కథతో చేసిన ‘రాహు’ సినిమా విజయవంతం కావాలని, మరిన్ని వైవిధ్యభరితమైన చిత్రాల రూపకల్పనకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను. మీ విజయశాంతి’ అని ట్వీట్ చేస్తూ ‘రాహు’ సినిమా ట్రైలర్‌ లింక్‌ను షేర్ చేసారు. ఇప్పటివరకు విడుదలైన అన్ని సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో థ్రిల్లర్ కథలు బాగా ఆడుతున్నాయి. ఇలాంటి టైంలోనే ‘రాహు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దర్శకుడు సుబ్బు. ఈ సినిమాలో నటించినవారంతా కొత్తవారే. జీ తెలుగు ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ‘‘రాహు’ సినిమాలో ఒక అమ్మాయికి రక్తం చూసినప్పుడు బ్లైండ్ అవుతుంది, స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అలాంటి అమ్మాయి జీవితంలో రాహు ఎంటర్ అయితే ఏమవుతుంది అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. సినిమా కంప్లీట్‌గా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. మేకింగ్ స్టయిల్ ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌గా ఉండబోతుంది’’ అని సుబ్బు ఓ సందర్భంలో వెల్లడించారు. READ ALSO: కంటెంట్ ఉన్న ఇలాంటి చిన్న సినిమాలను, అందులోనూ హీరోయిన్ ఓరియెంటెడ్ కథతో తీసిన సినిమాలను సపోర్ట్ చేయడానికి విజయశాంతి ఎప్పుడూ ముందుంటారు. తమ సినిమాకు సపోర్ట్ కావాలని టీం అడగ్గానే విజయశాంతి ట్వీ్ట్ చేసారు. ఇక ఆమె సినీ కెరీర్ విషయానికి వస్తే దాదాపు పదిహేనేళ్ల తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విజయశాంతి. ఇందులో ఆమెకు మంచి క్యారెక్టర్ దక్కింది. ఈ సినిమా తర్వాత విజయశాంతి మరో సినిమాకు ఒప్పుకోలేదు. ప్రస్తుతం తనకు సినిమాలు చేసే ఆలోచన లేదని, రాజకీయాలపైనే ఫోకస్ చేయాలని అనుకుంటున్నట్లు ఇటీవల ట్వీట్ చేసారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HYYJpr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...