Wednesday, 26 February 2020

నిర్మాత భార్యకు ఫోన్ చేసిన నటుడు.. ఆడియో లీక్

తమిళ నటుడు ఓ వివాదంలో ఇరుక్కు్న్నారు. ఆయన ఓ నిర్మాత భార్యకు ఫోన్ చేసి తన విడాకుల గురించి చర్చించాడట. కానీ ఎవరో ఆ కాల్ రికార్డ్‌ను లీక్ చేయడంతో కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై బాలా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘‘నిన్నటి నుంచి నా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు బయటికి వస్తున్నాయి. నాకు చాలా మంది ఫోన్లు చేస్తు్న్నారు. నేను నాలుగు నెలల క్రితమే విడాకులు తీసుకున్నానన్న సంగతి అందరికీ తెలుసు. నా సెక్యూరిటీ కోసం కొన్ని ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ప్రస్తుతం నేను నిర్మాత భార్యకు ఫోన్ చేసి మాట్లాడానంటూ ఎవరో ఆడియో లీక్ చేసారు. అది ఇప్పటిది కాదు. ఏడాది క్రితంది. కానీ ఇప్పుడు తప్పుడు కారణాలతో దానిని వైరల్ చేస్తున్నారు. ఆ ఫోన్ కాల్ బయటికి ఎలా వచ్చిందో తెలీదు. ఎవరో కావాలనే నన్ను నవ్వులపాలు చేయాలని చూస్తున్నారు. నేను తలుచుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు" READ ALSO: "కానీ నేను అలా చేయను. నేను అలాంటి వ్యక్తిని కాను. నా ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. ఇతరుల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టాలని అనుకోవడంలేదు. ప్రస్తుతం నేను ‘బిలాల్’ అనే సినిమాలో మమ్ముట్టి సర్‌తో కలిసి నటిస్తున్నాను. త్వరలో షూటింగ్ స్టార్ట్ అవబోతోంది. బాడీ బిల్డింగ్ విషయంలో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. 2020లో నాకు మంచి రోజులే వస్తున్నాయని అనుకుంటున్నాను. నాకు వివాదాల్లో తలదూర్చడం ఇష్టం లేదు’’ అని తెలిపారు. అయితే ఆ ఫోన్ కాల్‌లో ఏముందో, నిర్మాత భార్యతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో మాత్రం వెల్లడించలేదు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2I90Y9T
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...