Monday, 17 February 2020

V Teaser: సోది ఆపు, దమ్ముంటే నన్ను ఆపు అంటున్న నాని

నేచురల్ స్టార్ ఈసారి విలన్ పాత్రలో మెప్పించబోతున్నారు. మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ‘’ సినిమాలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ‘ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సర్. అప్పుడప్పుడు నాలాంటోడు గుడ్డిగా రూల్స్ బ్రేక్ చేస్తుంటారంతే’ అంటే పోలీసు గెటప్‌లో ఫైటింగ్ చేస్తూ సుధీర్ బాబు చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ఇందులో నాని సీరియల్ కిల్లర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. నానిని పట్టుకోవడానికి సుధీర్ ప్రయత్నిస్తుంటాడు. ‘న్యాయాన్ని ధర్మాన్ని కాపాడటానికి నువ్వు వస్తున్నావ్ అనగానే విజిల్స్ వేయడానికి నేనేమీ నీ ఫ్యాన్‌ని కాదురా. సోది ఆపు దమ్ముంటే నన్ను ఆపు’ అని నాని సుధీర్‌కి వేసిన పంచ్ హైలైట్‌గా నిలిచింది. ఇందులో నివేదా థామస్, అదితి రావు హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ‘జెంటిల్‌మెన్’ సినిమాలో నాని విలన్ పాత్రలో నటించాడు. ఇప్పుడు ఓ సైకోగా కిల్లర్‌గానూ కనిపించబోతున్నాడు. తమన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమాలో సుధీర్, నాని హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు. ఎవరికి ఎవరూ తగ్గకుండా యాక్టింగ్ విషయంలో గట్టిపోటీనిచ్చారు. ఇందులో నివేదా నాని ప్రేయసిగా, అదితి రావు హైదరి సుధీర్ ప్రేయసిగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ‘v’ టైటిల్‌ని అర్థం మాత్రం వెల్లడించలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37AKjGr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...