Friday, 21 February 2020

Ravi Teja ‘క్రాక్’ టీజర్.. కాలితో మీసం మెలేసే సీన్ ఏదైతే ఉందో..

‘ఒరేయ్ అప్పిగా సుబ్బిగా.. నువ్వు ఎవడైతే నాకేంటి రా’ అంటూ ‘క్రాక్’ పోలీస్ రచ్చ రచ్చ చేస్తున్నాడు. శివరాత్రి సంద‌ర్భంగా రవితేజ నటించిన క్రాక్ మూవీ టీజర్ విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్. మాస్ మహరాజా రవితేజకు డాన్ శీను, బలుపు వంటి కమర్షియల్ హిట్ చిత్రాలను అందించిన గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. శృతి హాసన్ చాలా రోజుల తరువాత రవితేజతో జోడీ కట్టింది. ఇక టీజర్ విషయానికి వస్తే.. మాస్ మహరాజా ఫ్యాన్స్‌ ఆయన నుండి ఎలాంటి యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్‌ కోరుకుంటారో క్రాక్ టీజర్‌లో అదే కనిపిస్తోంది. ఒంగోలులో జరిగే క్రైమ్‌ని అంతం చేయడానికి క్రాక్ పోలీస్‌గా రవితేజ మెస్మరైజ్ చేస్తున్నాడు. విక్రమార్కుడులోని విక్రమ్ రాథోడ్ మళ్లీ వచ్చాడా అన్నట్టుగా పోలీస్ గెటప్‌లో రవితేజ అదరగొడుతున్నాడు. ‘ఒంగోల్‌లో రాత్రి ఎనిమిది గంటలకు కరెంట్ పోయిందంటే కచ్ఛితంగా మర్డరే.. అనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఆద్యంతం ఉత్కఠభరితంగా సాగింది. అప్పిగా, తుప్పిగా, నువ్వు ఎవరైతే నాకేంట్రా డొప్పిగా’.. అంటూ తనదైన మ్యానరిజంతో రవితేజ చెప్పే డైలాగ్ మాస్ ఆడియన్స్‌తో విజిల్స్ వేయించేదిగా ఉంది. వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని రోల్స్ కీలకంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ టీజర్‌లో రవితేజ మీసాన్ని తన కాలితే శృతి హాసన్ మెలితిప్పే సీన్‌ హైలైట్‌గా ఉంది. తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో పాటు సాయి మాధవ్ బుర్రా మాటలు, రామ్ లక్ష్మణ్ ఫైట్స్, జీకే విష్ణు సినిమాటోగ్రఫీ ‘క్రాక్’‌ని కిర్రాక్ అనిపించేట్టుగానే కనిపిస్తున్నాయి. సమ్మర్ కానుకగా.. మే 8న విడుదల కానుంది క్రాక్ మూవీ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2wBwhaK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...