Sunday, 9 February 2020

Rajamouli: కంగ్రాట్స్ రామూ తాతయ్య గారూ.. వర్మను టీజ్ చేసిన జక్కన్న

ఎప్పుడూ ఇతరులపై సెటైర్లు, కామెంట్స్ చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు.. ఈసారి దర్శకధీరుడు ఎస్.ఎస్ షాకిచ్చారు. తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి వర్మ ఎప్పుడూ రాజమౌళి పేరుని వాడుకుని ఆయన్ను ట్యా్గ్ చేస్తుండేవారు. ఇప్పుడు వర్మను ఆటపట్టించేందుకు జక్కన్న వంతు వచ్చింది. వర్మ ఇప్పుడు తాతయ్య అయ్యారు. ఆయన కూతురు రేవతి ఈరోజు ఉదయం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ తనదైన శైలిలో కామెంట్ చేసారు. ‘‘కంగ్రాట్స్ రామూ తాతయ్యగారూ... మీ మనవరాలు మిమ్మల్ని ఏలేంత గొప్పది అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతకీ మీరు ఎలా పిలిపించుకోవడానికి ఇష్టపడతారు? రాము తాతా, రాము నాన్న లేకపోతే గ్రాండ్‌పా రామూనా?’ అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌ను ఇప్పటివరకే ఏడువేల మందికి పైగా లైక్స్ చేసారు. ఇక వర్మ కూతురు రేవతి విషయానికొస్తే.. ఓసారి వర్మ తన కూతురి కాపురం గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్ చేసారు. ‘నా కూతరు, అల్లుడు ఎంత అన్యోన్యంగా ఉంటారంటే.. వారిని చూసి బోర్ కొట్టింది. ఎప్పుడైనా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది’ అన్నారు. మరి రాజమౌళి ఇచ్చిన ఝలక్‌కి వర్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. READ ALSO: అయితే జక్కన్న చేసిన ట్వీట్‌పై కామెంట్స్ అన్నీ వర్మను టీజ్ చేసేలా ఉంటాయి అనుకున్నారు కానీ.. నెటిజన్స్ ఫోకస్ మొత్తం ‘RRR’ సినిమాపైనే ఉంది. అయ్యా సినిమా గురించి అప్‌డేట్ ఇవ్వండయ్యా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ‘RRR’ సినిమాను ఊహించని విధంగా 2021కి పోస్ట్‌పోన్ చేసారు. దాంతో ఫ్యాన్స్ అప్‌సెట్ అయ్యారు. కనీసం తారక్, రామ్ చరణ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ అయినా ఇస్తే బాగుంటుంది అని రాజమౌళిని వేడుకుంటున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SvTr9R
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...