తెలుగులో చక్కటి సినిమాల్లో నటించిన ప్రేక్షకులకు చేరువయ్యారు . మరోచరిత్ర, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, నాలుగు స్తంభాలాట, ఆనంద భైరవి, రుద్రవీణ తదితర సినిమాల్లో నటించారు. ఆమె చివరిగా నటించిన సినిమా ‘ఆకాశంలో సగం’. ఆ తర్వాత తన సొంతూరుకి వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు. తాజాగా జగన్ మూడు రాజధానుల విషయంపై తన అభిప్రాయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘ఏమయ్యా జగన్.. నీకు ఆస్తులు ఎక్కడుంటే అక్కడ రాజధానులు పెట్టేస్తావా. మాకు రాజధానిగా అమరావతే కావాలి. వైజాగ్‌లో ఏముందని దానిని రాజధాని చేస్తావ్. పదవిలోకి రాకముందు నాకు రాజధాని అమరావతి అయినా ఫర్వాలేదు అన్నావ్. పదవిలోకి వచ్చాక ఇష్టమొచ్చినట్లు మారుస్తున్నావ్. నీ ఊళ్లో ఐదు ఎకరాలు కట్టుకున్నావ్. ఓ పెద్ద ప్యాలెస్‌లాంటి ఇల్లు కట్టుకున్నావ్. ఇంగ్లీష్ మీడియం ఏంటి? మనం తెలుగు వాళ్లంకాదా? ఇంగ్లీష్‌తోనే అన్ని పనులు అయిపోతాయా? నాకు ఒంట్లో బాగోలేక ఇంటి పట్టునే ఉంటున్నాను కానీ తుళ్లూరు వెళ్లి ఆయన్ని తిట్టి రావాలని ఉంది. నేను ఎవ్వరికీ భయపడను" READ ALSO: "ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి. ఇక నా జీవితం గురించి చెప్పాలంటే ఉదయం లేవడం, స్నానం చేయడం, టిఫిన్ చేయడం, క్లబ్‌కి వెళ్లి పేకాట ఆడటం, మళ్లీ ఇంటికి రావడం పడుకోవడం. పేకాటలో పోగొట్టుకున్నాను గెలుచుకున్నాను. మా వారు చనిపోయాక పది కోట్ల ఆస్తి పోగొట్టాను. మా పిల్లలకి కూడా ఆస్తులు పంచేసాను. ఇప్పుడు నేను చేసేది ఏమీ లేదు. ఈ వయసులో పేకాట కాకుండా ఇంకేం చేయగలం’’ అని వెల్లడించారు కాకినాడ శ్యామల. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ShSWRQ
v
No comments:
Post a Comment