Tuesday, 4 February 2020

Corona virus: చైనా వెళ్తున్నా.. కరోనాను అంతమొందించే వస్తా: నటి షాకింగ్ వీడియో

ప్రపంచమంతా ఎక్కడ కరోనా వైరస్ సోకుతుందోనని వణికిపోతోంది. చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే 300 మందికి పైగా బాధితులను బలి తీసుకుంది. ఇప్పుడు ఈ వైరస్ ఇండియాకు కూడా వ్యాపించింది. వుహాన్‌లో మెడిసిన్ చదువుతున్న ఇద్దరు కేరళ వాసులకు కరోనా సోకింది. మున్ముందు ఇంకెన్ని మరణాలు చూడాల్సి వస్తోందోనని ప్రజలు హడలిపోతున్నారు. చైనా నుంచి వేరే దేశాలకు పారిపోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ను నేను అంతమొందించి వస్తానంటూ చైనా వెళ్లింది వివాదాస్పద బాలీవుడ్ నటి . మీరు చదివింది నిజమే. రాఖీ అక్క చైనాలో అడుగుపెట్టింది. తనతో పాటు వెంట తన స్నేహితుడిని కూడా తీసుకెళ్లింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. ‘నేను చైనా వెళ్తున్నాను. మహమ్మారి కరోనా వైరస్‌ను అంతమొందించి వస్తాను. కరోనా వైరస్‌ తగ్గించేందుకు నాసా నుంచి మందులు తీసుకొచ్చాను. నేను క్షేమంగా చైనా నుంచి తిరిగి రావాలని ప్రార్థించండి’ అని పేర్కొంది. అంతేకాదు కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే పరమేశ్వరుడిని ఆరాధించాలని అంటోంది. READ ALSO: ఎవ్వరికీ హాని తలపెట్టకుండా, ఎవ్వరి జీవితాలతో ఆడుకోకుండా, మంచి పనులు చేస్తూ ఉంటే ఇలాంటి వైరస్ బారిన పడమని, ఒకప్పుడు చైనా వాళ్లు జీసెస్‌ని హిందూ దేవుళ్లను నోటికొచ్చినట్లు మాట్లాడారు కాబట్టే వారికి కరోనా వైరస్ సోకిందంటూ వీడియో పోస్ట్ చేసింది. కరోనావైరస్ కారణంగా చైనాలో ఉన్న భారతీయుల్ని ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ముందు జాగ్రత్తగా వీరందర్నీ మనేసర్‌లోని క్వారంటైన్ సెంటర్లో అబ్జర్వేషన్లో ఉంచారు. వీరిలో ఐదుగురిలో దగ్గు, జలుబు లాంటి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఢిల్లీలోని ఆర్మీ బేస్ హాస్పిటల్‌కు తరలించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RYJNxs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...