Monday, 24 February 2020

ఆమె వల్లే నాకు చిరంజీవిని కలిసే అవకాశం వచ్చింది: టాప్ డిజైనర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇండియాలో ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్‌లో టాప్‌లో ఎవరైనా దూసుకెళ్తున్నారు అంటే అది కేవలం మనీష్ మల్హోత్రానే. బాలీవుడే కాదు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఆయన డిజైన్ చేసిన దుస్తులను వేసుకోవడానికి మొగ్గుచూపుతుంటారు. ఆయన డిజైన్ చేసే దుస్తులు చాల ఖరీదైనవే. కానీ ఒక్కసారన్నా వేసుకుని ర్యాంప్ వాక్ చేయాలని కోరుకోని సెలబ్రిటీ ఉండడంటే అతిశయోక్తి కాదు. అయితే.. ఒకానొక సందర్భంలో తాను మెగాస్టార్ చిరంజీవిని కలిసాను అంటూ తెగ సంతోషపడిపోతున్నారు మనీష్. అది కూడా అతిలోక సుందరి శ్రీదేవి వల్లే ఆయన్ను కలవగలిగానని అంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫ్యాషన్‌ షోలో తాను డిజైన్ చేసిన దుస్తులను ప్రదర్శించేందుకు మనీష్ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడి మీడియా వర్గాలతో మాట్లాడుతూ.. దక్షిణాది సెలబ్రిటీలతో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు. రామ్ గోపాల్ వర్మ ‘గోవింద గోవింద’ సినిమా తీస్తున్నప్పుడు విజయశాంతి, బాలకృష్ణ, చిరంజీవి లాంటి టాప్ సెలబ్రిటీలను కలిసే అవకాశం దక్కిందట. సౌత్ స్టార్స్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించేదని అన్నారు. అయితే ఈరోజు శ్రీదేవి రెండో వర్థంతి అని తెలిసీ బెస్ట్ ఫ్రెండ్ అయిన మనీష్ ఆమె నివాళులు అర్పించడం కానీ, ఆమెను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఏదన్నా పోస్ట్ పెట్టడం కానీ చేయలేదు. శ్రీదేవి చనిపోయిప్పుడు మాత్రం మనీష్ ఆమెను తెగ గుర్తుచేసుకున్నారు. ఆమెతో కలిసి పనిచేయడం తన అదృష్టం అన్నారు. కానీ ఈరోజు శ్రీదేవి చనిపోయిన రోజని తెలిసీ ఆయన ఆమె గురించి ఏమీ స్పందించకపోవడం గమనార్హం. నిజంగానే మర్చిపోయారో, లేక సంతాపం తెలపడం ఇష్టంలేదో ఆయనకే తెలియాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37W5qmu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...