బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ గారాలపట్టి తొలి సినిమాతోనే కోట్లాది ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టేసారు. స్టార్ కిడ్ కాబట్టి వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. అయితే తొలిసారి తన వ్యక్తిగత జీవితం గురించి తన సవతి తల్లి అయిన కరీనా కపూర్ షోలో వెల్లడించారు. ఎలాంటి మొహమాటం లేకుండా అన్నీ స్ట్రెయిట్‌గా మాట్లాడేసారు. ‘‘నాకు కాబోయేవాడిలో నేను ముందుగా చూసేది నిజాయతీ. అంతేకాదు అతనికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉండాలి. అందగాడు కాకపోయినా ఫర్వాలేదు. ఒకందుకు అది కూడా మంచిదే. ఎందుకంటే అందగాడు అయితే వాడిని నేను భరించలేను. అలాగని చెండాలంగా ఉండాలని నా ఉద్దేశం కాదు. నేను అందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంలేదు. ఒకవేళ నేను ఎవరినైనా ప్రేమిస్తే.. అతను నా వాడు అని నేను చెప్పుకోవడానికి గర్వంగా ఫీలవ్వాలి. ఎందుకంటే నాకు జీవితంలో అన్నీ ఉన్నాయి. అంతకుమించి నాకు ఇవ్వగలిగే వ్యక్తి నాకు దొరికినప్పుడే నేను ప్రేమలో పడతాను. అంతేకాదు నేను ఇప్పటివరకు ఎవ్వరితోనూ సెక్స్ చేసింది లేదు. అలాంటి రిలేషన్‌షిప్స్‌కి నేను దూరంగా ఉంటాను’’ అంటూ ధైర్యంగా అన్ని విషయాలను పంచుకుంది సారా. READ ALSO: ప్రస్తుతం సారా ‘లవ్ ఆజ్ కల్’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. తన తండ్రి నటించిన ‘లవ్ ఆజ్ కల్’ సినిమాకు సీక్వెల్‌గా రాబోతోంది. అయితే ఈ సినిమాకు మొదటి నుంచి నెగిటివ్ టాక్ వస్తోంది. సినిమా ఆడదని ముందే చెప్పేస్తున్నారు. ఎందుకంటే ట్రైలర్‌లో సారా నటన చెత్తగా ఉందట. ట్రైలర్ చూసాక బుద్ధి ఉన్నవాడు ఎవ్వడూ సినిమాకు వెళ్లడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2H6wHru
v
No comments:
Post a Comment