తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్స్‌లో ముందు వరుసలో ఉంటుంది. వరుస విజయాలకు తోడు స్టార్ హీరోలు కూడా పిలిచి అవకాశం ఇస్తుండటంతో ఈ ముద్దుగుమ్మ నెంబర్ వన్ హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీలో చక్రం తిప్పుతోంది. ఈమధ్య విడుదలైన ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో పూజా హెగ్డే రేంజ్ మరింత పెరిగిపోయింది. ఓ విధంగా చెప్పాలంటే కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. మహేష్ బాబుతో నటించిన మహర్షి సినిమా హిట్ అనిపించుకుంది కానీ బ్లాక్ బస్టర్ మాత్రం కాదు. దానికి ముందు అరవింద సమేత, డీజే సినిమాలు కూడా అంతే. దాంతో వరుసగా అవకాశాలు అందుకుంటున్న కూడా ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ లేని లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. అలాంటి సమయంలో వచ్చిన అల వైకుంఠపురంలో పూజా హెగ్డే కోరిక నెరవేర్చింది. ఈ సినిమా తర్వాత పూజకు ఆఫర్స్ వరుసకడుతున్నాయి. ఇంత బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ గురించి తాజాగా ఒక వార్త ఇండస్ట్రీలో బాగా చక్కర్లు కొడుతుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక లేనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే ప్రేమలో ఉంది అనే వార్త వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో వినోద్ మెహ్రా కుమారుడు రోహాన్‌తో పూజా హెగ్డే ప్రేమలో పడిందనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతుంది. గతేడాది విడుదలైన బజార్ సినిమాతో ఈయన పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఈ కుర్రహీరోతో పూజా హెగ్డే డేటింగ్‌లో ఉందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. READ ALSO: తమపై వార్తలు వస్తున్న కూడా ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. అంటే దాని అర్థం తమ మధ్య రిలేషన్ ఉందని ఒప్పుకుంటున్నారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై ఇద్దరూ ఏమంటారో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న పూజ.. యువ కథానాయకుడు అఖిల్‌తో కలిసి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించే అవకాశం పూజ దక్కించుకుంది. వీరిద్దరూ జోడీగా ‘కబీ ఈద్ కబీ దివాలీ’ అనే సినిమాలో నటించనున్నారు. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OJBvrg
v
No comments:
Post a Comment