Monday, 10 February 2020

37 ఏళ్ల వయసులో భర్తను వదిలేసా, అయితే ఏంటి: నటి సూటి ప్రశ్న

ప్రముఖ బాలీవుడ్ నటి మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇందుకు కారణం పలు బాలీవుడ్ మీడియా వర్గాలు పదే పదే విడాకులు తీసుకోవడం గురించి ప్రశ్నించడమే. 37 ఏళ్ల వయసులో దియా తన భర్త సాహిల్ సంఘాతో విడిపోయారు. ఈ వయసులో విడాకులు ఏంటి అని చాలా మంది అడుగుతున్నారట. ఆ బాధను ఎలా భరిస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ‘నేను సెలబ్రిటీని అయినంతమాత్రాన బాధ ఉండదని కాదు. మా అమ్మానాన్నలు విడిపోయినప్పుడు నా వయసు నాలుగేళ్లు. అప్పుడే ఆ బాధను భరించగలిగాను. అలాంటిది 37 ఏళ్ల వయసులో భరించలేనా? కొన్ని విషయాల్లో మహిళలు, పురుషులు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచిస్తుంటారు. కాస్త ఇబ్బందిగా ఉన్నా సరైన నిర్ణయమే తీసుకోవాలి. నేను 37 ఏళ్ల వయసులో భర్తకు విడాకులు ఇచ్చాను. అయితే ఏంటి? ఒకరిపై మనసులో పగలు దాచుకునే దాన్ని కాను. నా బాధనంతా వెళగక్కి ఆ తర్వాత ప్రశాంతతను వెతుక్కుంటాను. నేను 14 ఏళ్లుగా ధ్యానం చేస్తున్నాను. నేనుంటున్న బిల్డింగ్ మొత్తం మొక్కలతో నిండి ఉంటుంది. అందుకే నా ఇంటి చుట్టూ పక్షులు వస్తుంటాయి. లేకపోతే మీడియాతో సహా మనల్ని ఇబ్బందిపెట్టేవారు ఇంట్లోకి వచ్చేస్తుంటారు’’ సూటిగా సమాధానం ఇచ్చారు. READ ALSO: 2014లో ఢిల్లీ‌కి చెందిన బిజినెస్ మెన్ సాహిల్‌ సంఘాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు దియా మీర్జా. దానికి కొన్నేళ్ల ముందు నుంచే వాళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో 2014 అక్టోబర్‌లో ఢిల్లీలోని చత్తార్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు. 11 ఏళ్లు తనతో జీవితం పంచుకున్నాక పరస్పరం ఒప్పందంతోనే విడిపోతున్నాం అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు దియా. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39qC9li
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...